దీపం గుడిసెలో వెలుగుతూ
చీకటిని గొంగడిలా మడత పెట్టేసింది!
దీపం గర్భగుడిలో
వెలుగుతూ దేవుడి ముఖ వర్చస్సును
భక్త జనార్దనంగా దర్శింపజేస్తోంది
అరే! గుడిసెలో గుడ్డిదీపం!
ఓహో! గుడిలో అఖండదీపం!
ఇలా అన్నా దీపం ఏమీ అనుకోదు
వెలుగు వెలుగుడే అనుకునుడు!
దిక్కులన్నింటికీ సమంగా
కాంతి ప్రసాదం పంచిపెడుతుంది దీపం
పండుగ నాడు ఎన్ని పిండి వంటలు
తింటేనేం ఆయాసంగా నిద్ర మబ్బే!
దీపాలు వెలిగిస్తేనే
అందరి ముఖం వెలుగు వెలుగు
సమవర్తిగా దీపం చూపు!
భూమి పైని దీపాలకు
ఆకాశంలోని చుక్కలకు పోటీ
చుక్కలు మిణుకు మిణుకు
దీపాలు దేదీప్యమానం!
దీపం చూపు పడిందంటే
చీకటి హాంఫట్
దరిదాపులో ఎక్కడా కానరాదు!
‘రాత్రికి’ సంవత్సరానికి
ఒక రోజు దీపాల పండుగ!
దీపాలన్నీ తన బలగంగా
‘అమావాస్య’కు కాగడాలే!
ప్రజల చేతిలోని ఓటు కూడా దీపంలాంటిదే
గెలిచి ప్రజాస్వామ్యంగా వెలిగిపోతుంది!
కందాళై , రాఘవాచార్య
87905 93638