నెల్లూరు జిల్లాలోని గోవిందరాజు సీతాదేవి సాహితీ వేదిక నిర్వహించిన గోవిందరాజు సీతాదేవి జాతీయ స్థాయి సాహితీ పురస్కారం-2024 విజేతలను ప్రకటించారు. నవలా విభాగంలో ఆర్సీ కృష్ణస్వామిరాజు రచించిన ‘మేకల బండ’, కథా సంపుటి విభాగంలో కేఏ మునిసురేష్ పిళ్లె రచించిన ‘గారడీవాడు’ ఎంపికయ్యాయి.
త్వరలో పురస్కారాలను ప్రదానం చేయనున్నట్టు సాహితీ వేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు గోవిందరాజు సుభద్రా దేవి తెలిపారు.