వికారాబాద్ జిల్లా అనంత సాహిత్య సాంస్కృతిక వేదిక ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దివంగత ఠాకూర్ లక్ష్మీబాయ శంకర్ సింగ్ స్మారక కథల పోటీ, దివంగత శ్రీరాములు స్మారక కవితల పోటీ నిర్వహిస్తున్నట్టు సాంస్కృతిక వేదిక ప్రధాన కార్యదర్శి కమలేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. కథలు: ఏ-4 సైజ్లో 800 నుంచి 1,000 పదాల లోపు ఉండాలి.
తెలంగాణ భాష.. విశేషించి దక్షిణ, పశ్చిమ తెలంగాణ భాషకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు తెలిపారు. కథలు, కవితలు ఏప్రిల్ 21వ తేదీలోగా కమలేశ్, అనంత ప్రధాన కార్యదర్శి, ఇంటి నెంబర్: 8-4-8బీ/సీ, వీరభద్ర సంఘం పక్కన, సంగారెడ్డి రోడ్, శంకర్పల్లి, రంగారెడ్డి జిల్లా, పిన్: 501203 అనే చిరునామాకు పంపాలని సూచించారు. వివరాలకు: 9160396596 సంప్రదించాలని తెలిపారు.