కవులకు ఉపయోగపడని కాళోజీ కళాక్షేత్రం
వరంగల్ కవులు, కళాకారులు ఆశలకు అనుగుణంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు 2014 సెప్టెంబర్ 9న ప్రజాకవి, పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు శత జయంతి సందర్భంగా వరంగల్‌లో కాళోజీ కళాక్షేత్రానికి శంకుస్థాపన చేశారు.
వరంగల్ కవులు, కళాకారులు ఆశలకు అనుగుణంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు 2014 సెప్టెంబర్ 9న ప్రజాకవి, పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు శత జయంతి సందర్భంగా వరంగల్‌లో కాళోజీ కళాక్షేత్రానికి శంకుస్థాపన చేశారు. అంతకుముందు వరకు కూడా హైదరాబాద్ రాజధాని తర్వాత సాహిత్య, సాంస్కృతిక, నాటక రంగాల్లో గొప్పగా వెలుగులీనుతున్న వరంగల్‌లో ఆయా కార్యక్రమాలు నిర్వహించేందుకు ఎలాంటి సరైన వేదిక లేదు. దీనివల్ల ఇక్కడి కవులు, కళాకారులు తీవ్ర నిరాశా, నిస్పృహలకు లోనవుతున్న సందర్భంలో వారి ఆశలకు కేసీఆర్ ప్రాణం పోశారు.
కాళోజీ కళాక్షేత్రం బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన ప్రతిష్టాత్మకమైన సాంస్కృతిక కేంద్రం. 4.25 ఎకరాల విస్తీర్ణంలో సుమారు రూ.85 నుంచి 95 కోట్ల వ్యయంతో కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పర్యవేక్షణలో 4 అంతస్తుల భవనంగా అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ క్షేత్రం రూపొందింది. కాళోజీ జీవిత చరిత్ర, ఛాయాచిత్రాలు, రచనలు, అవార్డులను ప్రదర్శించే ప్రత్యేక ఎయిర్ కండిషన్డ్ ఆర్ట్ గ్యాలరీతో పాటు తెలంగాణ సాహిత్యం, సంస్కృతికి సంబంధించిన ప్రత్యేక పుస్తకాలతో కూడిన లైబ్రరీ అందుబాటులో ఉండేవిధంగా దీనికి ప్రణాళిక జరిగింది. ప్రధాన ఆడిటోరియం 1,127 సీటింగ్ కెపాసిటీతో అత్యాధునిక సౌండ్ సిస్టమ్, లైటింగ్, విజువల్ సిస్టమ్‌లతో నిర్మితమైంది. ప్రాంగణం ముందుభాగంలో కాళోజీ నారాయణరావు కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 2024 నవంబర్ 19న అధికారికంగా ఈ కాళోజీ కళాక్షేత్రాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం ఈ కళాక్షేత్రం సాంస్కృతిక ప్రదర్శనలు, నాటకాలు, సంగీత కచేరీలు, పలు ప్రభుత్వ, ప్రైవేటు కార్యక్రమాలకు వేదికగా మాత్రమే ఉపయోగపడుతున్నది. ప్రధాన ఆడిటోరియంలో సీట్ల కెపాసిటీ వెయ్యికి పైగా ఉండడంతో కవులకు సంబంధించిన సాహిత్య సభలు, చర్చలు, పుస్తకావిష్కరణలకు మాత్రం ఇది ఏమాత్రం ఉపయోగం లేకుండా పోయింది.
ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలన్నా అనేక వ్యయప్రయాసలకు వోర్చి అధిక మొత్తంలో భరించాల్సి వస్తున్నది. నిర్మాణ దశలో బీఆర్ఎస్ ప్రభుత్వం కవుల సమావేశాలు, సదస్సుల నిమిత్తం 200 సీట్ల కెపాసిటీతో మినీ కాన్ఫరెన్స్ హాళ్లు అందుబాటులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చింది. కానీ కళాక్షేత్రం ప్రారంభమైన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం, అధికారులు పక్కకు పెట్టి వాటిని పూర్తిస్థాయిలో నిర్మాణం చేపట్టకపోవడం వల్ల ఇప్పటికీ కూడా కాళోజీ క్షేత్రం కవులకు ‘కల’లాగే మిగిలిగిపోయింది. హైదరాబాద్ రవీంద్రభారతిలోని పైఅంతస్తులో ఉన్న మినీ హాల్ మాదిరిగా కాళోజీ కళాక్షేత్రంలో కూడా మినీహాల్‌ను అందుబాటులోకి తీసుకురావాలని వరంగల్ కవులు, కళాకారులు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారుల చుట్టూ తిరిగి ఎన్నో వినతిపత్రాలు అందజేశారు. అయినా వారంతా నిమ్మకు నీరెత్తినట్టు ప్రవర్తిస్తూ దాటవేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకొని రాబోయే కాళోజీ జయంతి సందర్భంగానైనా ఓరుగల్లు కవులు, కళాకారుల ఆకాంక్షల మేరకు ప్రభుత్వం కళాక్షేత్రాన్ని వాణిజ్యపరమైన దృష్టితో చూడవద్దని ప్రభుత్వాన్ని, అధికారులను కోరుతున్నారు. అంతేకాకుండా నామమాత్రం రుసుంతో వివిధ కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు వీలుగా రెండు మినీహాళ్లను అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
బిల్ల మహేందర్
9177604430
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

