పల్లవి: అదిగో అదిగో అదిగో తెలంగాణా రాష్ట్రమదిగో
అరవై ఏండ్ల స్వప్నాలను తీర్చే సంకల్పమదిగో
అదిగదిగో చైతన్య రూపమదిగో
దేశానికే వెలుగులు పంచే రాస్తా వేస్తుందదిగో ॥అది॥
చరణం: పుట్టిన బిడ్డకు ఇస్తుంది కేసీయార్ కిట్టు
పండు ముసలితో కట్టింది ఆసరాతో జట్టు
మిషన్ భగీరథ కాకతీయతో మురిసె పైరు గట్టు
హరితహారంతో వెలిసింది ప్రతీ ఇంట చెట్టు ॥అది॥
చరణం: కన్నాబిడ్డలా లగ్గం చేసే కల్యాణ లక్ష్మి
లక్షలాది సర్కార్ కొలువుల టీఎస్పీఎస్సీ
పేదల ఆకలి తీర్చే ఐదు రూపాయల అన్నం
దళిత బంధు రైతు బంధు సంక్షేమ రాజ్యం॥అది॥
చరణం: వేలాది గురుకులాలతో విద్యాగంధము
జిల్లా బస్తి దవాఖానలతో సంపూర్ణ ఆరోగ్యము
కులవృత్తుల అభివృద్ధితో పల్లెల నిండ సంతోషము
పరిశ్రమల స్థాపనతో పట్టణాల్లో సంబరము ॥అది॥
చరణం: కుల మతాల జాడే లేని గంగా యమునా తెహజీబ్
రంజాన్ బతుకమ్మ క్రిస్మస్ ప్రతీ పండగా సందడే
పౌరులకే కాదు దేవుళ్లకూ ఇది స్వర్గము
ఎములాడా యాదాద్రి వైభవమే దానికి సాక్ష్యమూ
-వంశీకృష్ణ, 95429 32438