నిన్నటి చీకటి కల చిట్లి
పొద్దు పొడిచింది
ఆధిపత్యపు కోరల కింద
అవమానాల రక్తపంకిలమై
బిక్కు బిక్కుమన్న నేల
పచ్చని మాగాణమైంది
దశాబ్దాల అస్తిత్వపు కల
సింగిడై ఆవిష్కరణయ్యింది
ఇవాళ..
రైతుల ఆపన్న హస్తం రైతు బంధు
కరువు కన్నీటిని కడిగేసిన కాకతీయ
వొంగిన వెన్నెముకలను నిలబెట్టిన నిట్టాడి ఆసరా
నవ వధువుల కలల పంట కల్యాణలక్ష్మి
గంగను భువికి దింపిన భగీరథయత్నం
ఆయురారోగ్యాలనిచ్చే ఆరోగ్యలక్ష్మి
కరువునేల కంఠాన ఆకుపచ్చని
‘చంద్ర’హారం హరితహారం
పచ్చని పొలాన్ని కలగన్న
బతుకు ధీమా రైతు బీమా
జలకళల జీవధార కాళేశ్వరం
తెలంగాణ తల్లి అమ్మవొడి రుణమాఫీ
ఇప్పుడు..
నా తెలంగాణ కోటి పథకాల మాగాణ
పచ్చని స్వరాల పసిడి పంటల బతుకు వీణ
దశాబ్దాల నా అస్తిత్వపు కల
తంగేడు పూవై నవ్వుతోంది
ఇంటింటా బంతిపూల బతుకమ్మై
కొలువుదీరుతోంది
పాలపిట్ట పాటై ప్రగతి ఊరేగుతోంది…
– చిత్తలూరి, 82474 32521