తెలంగాణ తెలంగాణ ఉయ్యాలో
బంగారు తెలంగాణ ఉయ్యాలో
ఎనిమిదేండ్ల పాలన ఉయ్యాలో – గొప్పనైన ప్రగతి ఉయ్యాలో
విజయం వరించెను ఉయ్యాలో -ప్రజల మనసు గెలిచెను ఉయ్యాలో
తెలంగాణ తెలంగాణ ఉయ్యాలో- బంగారు తెలంగాణ ఉయ్యాలో
॥తెలంగాణ॥
మెట్టపంటలన్ని ఉయ్యాలో- మేలు మాగాణులయ్యె ఉయ్యాలో
దేశానికే అన్నపూర్ణగా ఉయ్యాలో- తెలంగాణ అయ్యేను ఉయ్యాలో
॥తెలంగాణ॥
తిమిరంతో సమరం ఉయ్యాలో- 24గంటల విద్యుత్ ఉయ్యాలో
వెలుగులు విరజిమ్మెను ఉయ్యాలో- తెలంగాణ అంతటా ఉయ్యాలో
రైతులందరికి ఉయ్యాలో- ఉచిత విద్యుత్ ఇచ్చే ఉయ్యాలో
బీడుభూములను ఉయ్యాలో-సస్య శ్యామలం చేసే ఉయ్యాలో
రైతు బంధు పథకంతో ఉయ్యాలో -రైతును రాజును చేసే ఉయ్యాలో
॥తెలంగాణ॥
కాళేశ్వరం ప్రాజెక్టు ఉయ్యాలో- మిషన్ కాకతీయ ఉయ్యాలో
వేలాది చెరువులు ఉయ్యాలో -జల సిరులయ్యెను ఉయ్యాలో
మండు వేసవిలోను ఉయ్యాలో -నిండు కుండలయ్యె ఉయ్యాలో
॥తెలంగాణ॥
అమెజాన్, గూగుల్ ఉయ్యాలో – మైక్రోసాఫ్ట్ ఫేస్బుక్ ఉయ్యాలో
పారిశ్రామికీకరణ ఉయ్యాలో- కొత్తపుంతలు తొక్కె ఉయ్యాలో
॥తెలంగాణ॥
ఆసరా పెన్షన్ ఉయ్యాలో-కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ఉయ్యాలో
మిషన్ భగీరథ ఉయ్యాలో- ఇంటింటా దాహం తీర్చె ఉయ్యాలో
తెలంగాణను చేసే ఉయ్యాలో -డైనమిక్ స్టేట్గాను ఉయ్యాలో
॥తెలంగాణ॥
యాదగిరి గుట్టను ఉయ్యాలో- పసిడి తేరు చేసే ఉయ్యాలో
బతుకమ్మ సంబురాలకుఉయ్యాలో -బంగారు బాటవేసే ఉయ్యాలో
సంస్కృతి సంప్రదాయాలకు ఉయ్యాలో- పెద్దపీట వేసే ఉయ్యాలో
॥తెలంగాణ॥
కరోనా కట్టడిలో ఉయ్యాలో-దేశానికే స్ఫూర్తి ఉయ్యాలో
ఎనిమిదేండ్ల పాలన ఉయ్యాలో- వందేండ్ల భవిష్యత్తు ఉయ్యాలో
దేశానికే తెలంగాణ ఉయ్యాలో- ఆదర్శ రాష్ట్రమయ్యే ఉయ్యాలో
॥తెలంగాణ॥
మేడారం జాతర ఉయ్యాలో- తెలంగాణకు మకుటమాయె ఉయ్యాలో
గోల్కొండ కోట ఇప్పుడు ఉయ్యాలో-
జాతీయ పండుగలకు నెలవాయె ఉయ్యాలో
ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాలో-ప్రగతికి మారు పేరు ఉయ్యాలో
॥తెలంగాణ॥
– సంబరాజు రమణి, 98662 31801