పరనిందాసుపాండిత్యం స్వేషు కార్యేష్వనుద్యమః
ప్రద్వేషశ్చ గుణజ్ఞేషు పంథానోహ్యాపదాం త్రయః
ఎల్లప్పుడు ఇతరులను నిందించటంలో ప్రతిభా పాటవాలు ప్రదర్శించడం, తాను చేయవలసిన పనులను పట్టించుకోక పోవడం, మంచివారియెడల ద్వేషభావము కలిగియుండటం… ఈ మూడు లక్షణాలు ప్రతివ్యక్తికి ప్రమాదకరం. కాబట్టి ఎవరైనా ఇతరుల తప్పులను వెతకటం కాకుండా… తనను తాను ఆత్మపరిశీలన, స్వీయవిమర్శతో మసలుకొన్నప్పుడే ఉత్తముడు కాగలడు.
-టి.సుధాకరశర్మ