రాజకీయ లక్ష్యాలే పరమోన్నతమైతే
రాజ్యాల్ని కూల్చిన రాబందులు ఎందరెందరో
చరిత్ర గర్భంలో దాగిన రాక్షస కృత్యాలు
గతాన్ని పాఠాలుగా నెమరేయకపోవడం..
మానవ నైజం నేర్వని ఒక గుణపాఠం
సిద్ధాంతాలు నియంత్రించజాలని బలహీన రుగ్మతలు
శాపాలై ఆదర్శాలను నిట్టనిలువునా
కూల్చేసే విషాదాలు
ఏమున్నది మానవ జాతి గర్వకారణం?
పరపీడన పరాయణత్వం..
ఇదొక శాశ్వత సత్యంగా పరిణమించాలా?
మేల్కొన్న నాగరిక సమాజం
ప్రమాణాలను పాతరేయాలా?
పరిఢవించిన మేధో పరిమళాలు
ఇంకా విముక్తి ప్రసాదించ లేని దీనావస్థలు
జీవనకాలంలో ఎదురయ్యే ఆటుపోట్లు
రాగద్వేషాలు నిర్దేశించే ‘స్వార్థం’ పాలు కావొద్దు
రాజకీయ రణక్షేత్రం ధర్మాగ్రహాల కురుక్షేత్రం
వ్యక్తుల అభీష్టాలు కాల పరీక్షలో మైలురాళ్ళు
అవి జాతిపథాన్ని నిర్దేశించే కొలమానాలు
ఏ రాజకీయ పక్షమైనా…
‘అంభి- పురుషోత్తం’ల ఉదంతం..
పునరావృతమై మరో చరిత్ర కాగలదా!
కె.లక్ష్మణ్ గౌడ్
9704930509