పల్లవి: గణం గణం తెలంగాణ ఘనతయెంతో పెంచెను
జయం జయం తెలంగాణ జగతికి చాటి చెప్పెను
వేల వేల త్యాగాలతో వెలిసిన ఈ నేలను
కేసీఆర్ సీఎం అయ్యి ప్రగతిపథంలో నడిపించెను ॥గణం॥
చరణం: ఆసరా పథకంతో ఆశాదీపమై
అర్ధంత బతుకులకు అభయమిచ్చే
పేదింటి ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి తెచ్చి
అక్షంతలు వేసి అన్నవోలె ఆదరించే.. ॥గణం॥
చరణం: ప్రగతికి దారిచూపి పయనించెను విజ్ఞానం
మన ఊరు మనబడి సృష్టించెను ప్రభంజనం
అమరవీరుల త్యాగాలతో వెలసిన ఈ నేలను
కేసీఆర్ సీఎం అయ్యి ప్రగతిపథంలో నడిపించెను ॥గణం॥
చరణం: కాళేశ్వరం జలధారను ప్రతిపల్లెకు పారించి
పచ్చని పొలాలతో రైతన్నను మురిపించెను
మిషన్ కాకతీయతో పూడికలు తీయించి
బీడు భూములను పంట పొలాలుగా మార్చె ॥గణం॥
చరణం: పల్లెలు పట్టణాలు ప్రకృతికి ప్రతిరూపంగా
హరితహారం వన్నెలతో వెన్నెలు కురిపించెను
ప్రగతిపథంలో తెలంగాణ ప్రభంజనం సృష్టించెను
కేసీఆర్కు ప్రజలు వందనాలు అర్పించెను ॥గణం॥
– బండకింది రాకేష్ , 96406 14378