(ఆటవెలది పద్య తోరణం…)
దేశమందులేని దేదీప్య కార్యముల్
రాష్ట్రమందు చేసె రయము గాను
ఒకటి రెండుకాదు ఓర్పుతో నేర్పుతో
రైతు తోడు గాను రమ్యముగను..!
భరతదేశమందు పరి పాలనలతోను
భాగ్యవంతులైరి ఫలము లొసగ
పెక్కురాష్ట్రములలొ పేదరికంబును
మనదు ప్రజకు చేసె మంచి పనులు..!
ఇంత సేవలన్ని యిచ్ఛతో సల్పియు
రాష్ట్ర తీరు మార్చె రాజిల గను
ఉత్తమోత్త మయ్యె వున్న సంపద లాయె
చేత నైన పనులు చేయు చుండె..!
త్రాగు నీరునిచ్చె సాగు నీరునునిచ్చె
కోనసీమ మించు కోర్కెతీర్చె
హరితహారమింపు హాయిగా తీర్చెను
చంద్రశేఖరున్ని మించి లేరు..!
తెలుగు కళల కెంత తేజంబు నిచ్చెను
విశ్వ తెలుగు సభలు వినుతి కెక్కె
నవయువ కవులకును నాంది పల్కి నిలను
కొత్త తరము వెలుగు కోరె చూడ..!
పనులు చేయ పచ్చగానుండిరి ప్రజలు
అమలుచేయు వారు నాద్యులేను
అట్టివారిచెంత ననవరతంబును
సర్వజనులు కూడి సాగురిలను..!!
– చింతోజు పద్మావతి
84649 54860