తెలంగాణ పోరండ్లు
తక్కువోండ్లేం కాదు
కలగల్పుగ కొట్లాడినం
కలెవడి రాష్ర్టాన్ని దెచ్చుకున్నం
నకురాలు జూయించి
నీలుగుతున్న గుంట నక్కలకు
ఒక్క కుత్తికెతోటి కబర్దార్ జెయ్యాలె
గుండెల్ల తాకాలె
గుబులు రేపాలె
బీరిపోయి సూడకుండ
గుడ్లుర్మి సాగుతున్న
మన కేసీఆర్ సార్కు
ఇమ్మతియ్యాలే
ఇగో.. గప్పుడే
మన రాష్ట్ర పెద్దిర్కము నిలవడ్తది
అడుగున వడ్డ మన బత్కులకు
సిసలైన బత్కు దొరుకుతది
మన అచ్చమైన రాష్ర్టానికి
ఆకుపచ్చని దస్కత్ అయితది
– దాసరి (జంగిటి) శాంతకుమారి,
9652483644