అదిగో… అదిగదిగో కేసీయార్
బంగరు తెలంగాణకు మొలిచిన వరినారు
తెలగాణ జాతికై ప్రాణం పణం బెట్టినారు
తెలగాణ మొనగాడని విశ్వమంత జాపినారు ॥అది॥
పేదోళ్ల కాసరాగ పట్టెడన్నం బెట్టుతుండు
లేనోళ్ల ఇళ్లలో సన్నబియ్యం నింపుతుండు
పేదోళ్ల గుండెల్లో అనాథలకు ఆసరాగా
పెదకొడుకై నిలిచినాడు.. ॥అది॥
కల్యాణలక్ష్మితో కలకాలం నిలువుమని
షాదీముబారక్‌తో షహనాయి పాడుమని
కన్నోళ్ల కడగండ్ల కనుపాపై నిలిచి
పెండ్లోళ్ల ఇంటిలో మేనమామై నిలిచినాడు ॥అది॥
ఒంటరి బతుకులకు ఇంటిదీపమైనాడు
దీనుల పాలిట దీనబంధువైనాడు
రైతుకు బీమానిచ్చి రైతు ధీమైనాడు
అనాథలందరికీ ఆత్మబంధువైనాడు.. ॥అది॥
పల్లేర్ల భూముల్లో పసిడి పంట నిలిపినాడు
గంగమ్మ నీళ్లుదెచ్చి రైతు కన్నీళ్లు తుడిసినాడు
కళ్లుండి చూడనోళ్ల నోళ్లకు
కుసింత దూరమై నిలువుమండు ॥అది॥
అందరి గుండెల్ల ఇంద్రధనస్సై నిలిచి
ఇగురం నేర్పిన ఇలవేల్పు ఈ సారు
లక్ష నౌకరీలను లక్ష్యంతో గెలుచుకొని
మన యువజాతికి బాపుమని పెదబాపై కోరినాడు ॥అది॥
– ఎస్.వెంకటాచార్య, 99495 91937