నాడు అస్తిత్వం కోసం పోరాటం
నేడు అభివృద్ధిపథాన స్వీయ రాష్ట్రం
రైతు పక్షపాతిగా పేరుగాంచి
విరామం లేకుండా విద్యుత్తునందిస్తూ
కాళేశ్వరంతో కోటి ఎకరాల మాగాణంగా
అవతరించింది నా తెలంగాణ నేల…
వృద్ధులకు ఆసరా పింఛన్లు,
ఆడపడుచులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్లు
రైతన్నలకు రైతుబంధు, బీమాలతో కలిగే ధీమా
భూ పరిపాలనలో నవశకం ధరణి పోర్టల్
మిషన్ కాకతీయతో చెరువులకు పునర్వైభవం
ఇంటింటికి తాగునీరిచ్చే మిషన్ భగీరథ
విత్తన భాండాగారంగా విలసిల్లుతూ
అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షిస్తూ
పరిశ్రమలకు స్వర్గధామమైంది నా తెలంగాణ
ఎనిమిది వసంతాల నా తెలంగాణ
బంగారు తునక కావాలి భవిష్యత్తున..!
– యాడవరం చంద్రకాంత్ గౌడ్, 94417 62105