అక్షరాల కూర్పుకై
అర్ధరాత్రి జాగారం,
పదాల పరిమళంకై
నిఘంటువుల శోధన.
ఎవరి కోసం ఈ ఆరాటం!?
దేనికోసం ఈ పోరాటం!?
సత్యాసత్యాల అన్వేషణలో
అడుగడుగునా ఆటంకం.
ద్రోహ చీడల నిర్మూలనకు
కఠిన శబ్ద ప్రయోగం.
పదసిరి పంటల సాగుకై
కలహలంతో సేద్యం
కదిలించకపోతే అదేం కవిత!
నినదించకపోతే నీదేం కంఠం!!
ప్రశ్నకు జవాబు, జవాబులో ప్రశ్న
అది కదా కవితా, భవితా!
పండంటి కవితకై
కవి పడే ప్రసవ వేదన
కనిపించేనా!
వినిపించేనా!
లాలించే సౌభాగ్యం
దొరికేనా ఈ అభాగ్యులకు
కుర్మ మహేష్
63053 25021