ఓ రామా ఈ గంగ ఇప్పుడు మైల వడ్డది
కాల్చే కట్టెలకన్న శవాల సంఖ్య
ఎక్కువై తేలుతున్నాయి
ఓ రామా నీ బిడ్డ భరతమాత దగా పడ్డది
కాపాడే చేతులే తనను
అమ్మేస్తున్నాయి
ఓ రామా నీ ఆకాశం చిన్న బోయింది
వలస కూలీల హాహాకారాలు
మిన్నును దాటేశాయి
ఓ రామా నీ ధర్మం కాలి పోతున్నది
తమం పేరిట మతం
సర్వాన్ని దహించేస్తుంది
ఓ రామా నీ అడుగుజాడ మాయమైతున్నది
చరిత్రను చెరిపేసే చేతులే
చప్పట్లు కొడుతున్నాయి
ఓ రామా నీ కల్పవృక్షం పూయనంటున్నది
‘మోడి’ వారిన హృదయం
అన్నింటిని దహించేస్తుంది
ఓ రామా నీ సారంగి సమయం ఆసన్నమైంది
‘నమో’ అని మోసం చేస్తున్న
నామాన్ని దహించెయ్యాలి.
నరాల సుధాకర్
89777 11111