నుల్క మంచంలకెళ్లి లేవకముందే
రంగురంగుల జెండాలు వట్టుకొని
పేదోడి కడపలోకచ్చి బుజ్జగించే ఓట్ల పండుగిదీ..!
ఖద్దరు బట్టలేసుకొని
పేదోడి గద్మ వట్టుకొని,
దండాలు వెట్టుకుంట
నేతలంతా వాడవాడలు తిరుగుతూ
తమ తలరాతలు మార్చుకునే
ఓట్ల పండుగిదీ..!
అందుకే… పత్తులేరుకుంటా
పచ్చడి మెతుకులు తినుకుంటా
మాయల ఫకీరు వోలె
మాయమాటలు చెప్పి
ప్రమాణాలు చేసి,
హామీలు వాయిదాలేసే
ఉద్దెర మాటలకు
అమ్ముడు పోవద్దు నీ ఓటు.
కన్నీళ్లు తుడ్సే నాయకునికెయ్యి నీ ఓటు
ఓ మునుగోడన్నా…
నీ ఓటు అభివృద్ధికి మనుగడ గావాలె…
ఈ ఓట్ల పండుగ
నీ బతుకును ఓడించేది కాదు
ఒడ్డుకు చేర్చే ఓ నమ్మకం..
ఓ ఓటరన్నా తెలుసుకో..
తెలుసుకొని మసులుకో…
తుమ్మల కల్పనారెడ్డి
96404 62142