ఓటును నేనో ఓటును
ప్రజాస్వామ్య ఆయువు పట్టును
‘సోక్రటీస్’ ప్రశ్నలతోనే నా బీజం
‘ప్లేటో’ ‘రిపబ్లిక్లోనే నా జననం
చేతులెత్తే కాలం దాటి
‘మీట’ నొక్కే కాలం వరకు
నా అప్రతిహత పరిణామ క్రమం
సాగుతుంది ఖండాంతరాలకు
పద్దెనిమిది యేండ్ల చిరు మొగ్గు
ఓటరై వేస్తుంది తొలి ముద్ర
లెక్కకు చేరే ఓట్లు ఎన్ని ఉన్నా
గెలిపించే ఒకే ఒక్క ఓటు మిన్నా
చెల్లని ఓటుకు గీతలు ఎక్కువ
వెయ్యని ఓటుకు ఆత్రం ఎక్కువ
ఓటుకు నోటుతో వియ్యం
ఎలక్షన్లలో అవుతుంది కయ్యం
సావిత్రి సత్యవంతుని ఆయువు
యుముడి నుంచి కాపాడిన చందం
ఐదేండ్ల నా ఆయువు నిలబెట్ట లేరా?
ప్రజాస్వామ్యంలో ఎన్నిక
ప్రజాభిప్రాయ మన్నిక
మ్యానిఫెస్టోలు పార్టీలకు గీత
ప్రజా విశ్వాసము వాటికి వాత
ఓటును ఓటుకు అమ్మినా, కొన్నా
అంగట్లో బిడ్డ వాడమ్మకు
మీటా లేక నోటా ఏదో ఒకటే నొక్కు
విస్మరించకు నీ ఓటు హక్కు
ఎన్నికల్లో నీ ఒక్క ఓటు విలువెంతో!
తులాభారంలో శ్రీకృష్నుని
తూచిన తులసి దళమంతా!
పి.బక్కారెడ్డి
97053 15250