కొమ్మలకు కొత్త ఆకులు
ప్రతి చెట్టుకు ఆకులు రాలుతాయి ఆకులు రాలిపోయినంత మాత్రాన చెట్టు మొండి మానవుతుందా..?
ప్రతి చెట్టుకు ఆకులు రాలుతాయి
ఆకులు రాలిపోయినంత మాత్రాన
చెట్టు మొండి మానవుతుందా..?
మానులో బలమున్నంతవరకు
మండలు చిగురిస్తూనే ఉంటాయి
కొమ్మలకు కొత్త ఆకులు
పుడుతూనే ఉంటాయి
అది ప్రకృతి ఆనవాయితీ
ఆకు రాలడం ఆకు చిగురించడం
మాను మతి తప్పదు
కొత్త చిగురు తొడిగిస్తుంది
పాత ఆకు రాలితే
కొత్త ఆకు పుడుతుంది
కొత్తది, పాతవుతుంది
పాతది, కొత్తగవుతుంది
పండుటాకు రాలితే పసరాకు నవ్వుతుంది
పసరాకు పండుదై రాలుతానని
యాదిమరిచి అది నవ్వుతుంది!
దేవరపాగ కృష్ణయ్య
99634 49579
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

