ఆస్తి గాలి సోకి స్వార్థం
కారుమబ్బులా కమ్మేయగా,
ఈర్ష్య, అసూయలు
మనిషితనానికి ముసుగు కప్పేయగా,
మనసు పొరల్లోని
మానవత్వం మసకబారిన క్షణాల్లో
బంధుత్వం కాలం చెల్లిన పదమై
సహాయం కోసం చేసిన ఆర్తనాదాలు
కంచే మింగేయగా
మరో అబల ప్రాణం
గాలిలో కలిసిపోయింది.
ఓ మనిషీ!
మానవత్వం నీ సహజ గుణం,
దానవత్వం నీవు నేర్చిన దుర్గుణం.
పశుతత్వం, క్రూరత్వం మాని
మంచితనం పెంచుకో,
ద్వేషం తుంచుకో.
జాలి, దయలను హృదిలో దాచుకొని
అనురాగ, ఆత్మీయతలను
నీ మస్తిష్కంలో పదిలంగా నాటుకో.
అందమైన లోకంలో
నీ పాత్ర సుస్థిరం చేసుకో…
-వేమూరి శ్రీనివాస్ 99121 28967