అవమానాలను గుండెలో పోగు చేసుకోకూడదు
ఎప్పడిదప్పుడే దులిపెయ్యాలి
ఓటమిని ఏ జంబి చెట్టు పైననో
వదిలేసి రావాలి తిరిగి చూడకుండా
నిందలన్నీ శిలువలుగా మారకముందే
కాసిన్ని నిప్పులపై నడచి వెళ్లాలి
చిన్నచూపు కొమ్మలపై కాచుకుని ఉంటుంది
గద్దలకు దూరంగా దొరకకుండా
వినబడుతుంటాయి
కనబడుతుంటాయి
చెప్పబడుతుంటాయి
చింతలన్నీ చిరునవ్వుకు అంకితం చేయాలి
లేకుంటే గుండె నిండా స్టంట్లే…
-దాసరి మోహన్
99853 09080