దూరాన నునుపుగా
అగుపడే కొండలు
ఆకాశ దీపమై వెలిగే
ఆదిత్యుడు
పచ్చపచ్చని పంటచేలు
నడుమ పారే సెలయేరు
ఏటిలో జలకాలాడుతూ
పల్లెప్రజలు
ఏరు పక్కనే
వ్యాయామం చేస్తూ
ప్రకృతి అందాలు తిలకిస్తూ
ఆనందిస్తూ పెద్దలు
చేను పనులు చేస్తూ
సరదాగా ముచ్చటిస్తూ
శ్రమను మరిచిన కూలీలు
ఆత్మీయత ,అనురాగం
కలగలిసిన సంగడీల
కష్టసుఖాల వనవిహారం
స్వచ్ఛతకు మరోరూపం
పల్లె సోయగం
దివ్యౌషధమొక్కలకు
ఆలవాలం
సర్వజన శ్రేయోదాయకం
-సిరిపురం వాణిశ్రీ
93920 23988