విప్లవాల పతాక
ఉద్యమాల దీపిక
ధిక్కారాల గొంతుక
గిరిజనోద్యమ నాయక
తెలంగాణ అరుణ తారక
గోండు వీర.. కొమురం భీమ్
ఆదివాసీ హక్కుల కోసం
సాయుధ పోరెత్తినవాడు
నిజాం దోపిడీ పాలనపై
విప్లవాగ్ని రగిల్చినవాడు
భూస్వాముల గుండెలకు
విల్లంబు ఎక్కుపెట్టినవాడు
దున్నేవాడిదే భూమని
రగల్ జెండా ఎత్తినవాడు
జల్, జమీన్, జంగిల్ అంటూ..
జంగ్ సైరన్ జమాయించాడు
గిరిజనుల సంఘటితపరిచి
గెరిల్లా యుద్ధం చేసినవాడు
స్వేచ్ఛ కోసం..
ఆత్మగౌరవం కోసం..
స్వయం పాలన కోసం..
తెలంగాణ విముక్తి కోసం
తుదిశ్వాస దాకా పోరుచేసి
అమరత్వాన్ని హత్తుకున్నాడు
ఆదివాసీల పోరు ధీరకు
అరుణారుణ వందనాలు
తెలంగాణ రణ యోధకు
విప్లవోద్యమ నీరాజనాలు
-కోడిగూటి తిరుపతి , 95739 29493