ప్రగతి పథంలో రాష్ట్రం పరుగులు పెడుతున్నది
ప్రతి ఇంటికి కేసీయార్ పథకమందుతున్నది
పుటుక నుండి చావు వరకు సరుకారే భరోసాగా
అన్నింటికి తానే అయి ప్రతి ఇంటికి పెద్దన్నయై.. ॥ప్రగతి॥
ఆడబిడ్డ పెండ్లికి లక్షా నూట పదహారులు
గర్భిణికి శ్రీమంతాలు శిశు రక్షణ కేంద్రాలు
బిడ్డ పుడితె కిట్టుతో సహా పదమూడేలిస్తున్నరు
సరకారు దవాఖాన్ల బాలింతల సందడితో.. ॥ప్రగతి॥
వృద్ధులకు రెండువేలు వికలాంగులకు మూడేలు
వంటరి మహిళలకు వితంతువులకు రెండువేలు
అంగన్ వాడి మహిళలు ఆశావర్కర్ల జీతాల్
ప్రతి పథకం పక్కాగా లబ్ధిదారులకు అందగ… ॥ప్రగతి॥
ఆడపడుచు లందరిని ఆదరించి గౌరవించి
బతుకమ్మ పండుగలకు సారె చీరె అందిస్తూ
పంచాయితీ పాలనలో పచ్చదనం పరిశుభ్రత
గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాలతోటి.. ॥ప్రగతి॥
రైతును రాజుగ చేయగ అన్న కేసీయార్ కదిలె
ఎకరాకు పదివేలు పెట్టుబడిగ ఇస్తున్నరు
రైతన్న మరణిస్తే అయిదు లక్షలిస్తున్నరు
ప్రపంచంలో లేనట్టి పథకాలతో తెలంగాణ… ॥ప్రగతి॥
మిషన్ కాకతీయ ద్వారా నిండుకుండలై చెరువులు
మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి మంచినీరు
పల్లేర్ల భూములన్ని పసిడి పంటలు పండించగ
కాళేశ్వరం గోదారిని బీళ్లకు మళ్లించినాడు… ॥ప్రగతి॥
ఇరువది నాలుగ్గంటలు ఉచిత కరెంటిస్తున్నరు
గిట్టుబాటు ధరతోపాటు కొనుగోలు కేంద్రాలు
ముదిరాజులకు ఉచితం కోట్ల చేప పిల్లలిచ్చి
యాదవులకు గొర్రెలు దళితులకు దళిత బంధు… ॥ప్రగతి॥
ప్రతి కులము ప్రతి మనిషి ప్రగతి పథంలో నడిచె
ఊరూ వాడా పల్లె పట్నం.. బంగారు కాంతులీనె.. ॥ప్రగతి॥
-కన్నెబోయిన అంజయ్య, 94903 70563