చెరువునిండా నీళ్ళు, కడుపునిండా బువ్వ
చేతి నిండా పని, కంటి నిండా నిద్ర
నిజమైన నా కల నవ తెలంగాణ!
తెలగాణ పోరు భగీరథి నీరు, ఆగిపోని లైటు
పండించిన పంట రాసులోలె ఇంట
నిజమైన నా కల నవ తెలంగాణ!
గుడిసెలన్ని పోయే రెండుగదులిండ్లాయె
కూర్చుండ తీరిక లేదు చేతినిండా పని
నిజమైన నా కల నవ తెలంగాణ!
నీరు పల్లమెరుగు నిజం దేవుడెరుగు
ఎత్తి పోసె కాళేశ్వరం ఎదురుకు పారె
నిజమైన నా కల నవ తెలంగాణ!
యాదాద్రి నిర్మాణం అవనికే అద్భుతం
సచివాలయం స్వప్నం అసమాన సంకల్పం
నిజమైన నా కల నవ తెలంగాణ!
ఆకలికి అన్నం, దూపకు నీరు
సగటు మనిషికి సహకారం అందించిన తీరు
నిజమైన నా కల నవ తెలంగాణ!
రైతు, దళిత బంధు అందరికీ షాదీ ముబారక్
యెనిమిది ఏళ్ల వరాలు అష్టదిగ్గజాలు
నిజమైన నా కల నవ తెలంగాణ!
కాళేశ్వరం మేడిగడ్డయి, మల్లన్న సాగరై
ఊరు ఊరు తిరిగి చెరువులన్నీ నింపె
నిజమైన నా కల నవ తెలంగాణ!
సస్యశ్యామలమైన పచ్చని పైర్లు
నిండిన చెరువులు నీళ్లు కక్కుతున్న బోర్లు
నిజమైన నా కల నవ తెలంగాణ!
గొర్రెలు బర్రెలు సూకరముల పంపకం
చేనేత చేయూత, చేపల పెంపకం
నిజమైన నా కల నవ తెలంగాణ!
మేడ్ ఫర్ తెలంగాణ, మేకింగ్ ఇండియా
అగ్రగామి కేటీఆర్ ఐటిరంగం ప్రతిభ
నిజమైన నా కల నవ తెలంగాణ!
కలలసాకారం కలువకుంట్ల వరం
దేశానికే గర్వం ఈ సుస్వరం
నిజమైన నా కల నవ తెలంగాణ..!
-కందుకూరి మనోహర్, 99082 31588