పల్లవి: సారు జూడరో సర్కారు జూడరో-
కేసీఆర్ పథకాల జోరు జూడరో.. 2
అరవైయేండ్ల తండ్లాటకు అడ్డుగోడగా నిలిచి
ఎనిమిదేండ్లలోనే గొప్ప మార్పులెన్నో దెచ్చెరా.. ॥సారు॥
చరణం: సందెకాడ సందమామ- తొంగిచూసినట్లుగా
తొలకరిలో పుడమితల్లి- పులకరించినట్లుగా
గాయపడ్డ తెలంగాణ- గేయమయ్యి సాగెరో
దగాపడ్డ బతుకులకు- దారి దీపమయ్యెరో.. ॥సారు॥
చరణం: పొద్దంతా పనిజేసి- ఇంటికొచ్చిన తల్లులకు
బిందె మోతలొద్దంటూ- భగీరథుడయ్యెరో
ఊరి సెరువు నిండుగుంటె- ఊరంతా సల్లగాని
మిషను కాకతీయతోటి- సెరువులన్ని నింపెరో.. ॥సారు॥
చరణం: కాళేశ్వర ప్రాజెక్టు- కట్టించే దండిగా
మూడేండ్ల కాలంలో- పూర్తిజేసె మెండుగా
గోదారి దారి మలిపి- బీడుభూమి నోరు తడిపి
మల్లన్న కాళ్ళు కడిగి- పోచమ్మకు సాకబోసె.. ॥సారు॥
చరణం: రైతుబంధు రైతుబీమా- అన్నదాతకు వరమాయె
దళితబంధు పథకంతో- దళితులకు బంధువాయె
ఆసరా పింఛన్లతో- అవ్వ తాత కాసరాయె
దివ్యాంగ బిడ్డలకు- దీమా కల్పించెరో.. ॥సారు॥
చరణం: కల్యాణ లక్ష్మితోటి- లక్ష కానుకిస్తుండు
సన్నబువ్వతోటి పిల్లల -సల్లంగ జూస్తుడు
కానుపైన తల్లులకు- కేసియార్ కిట్టిచ్చి
అమ్మ ఒడి వాహనంలో- ఇంటికాడ దింపొచ్చె .. ॥సారు॥
చరణం: నలుదిక్కుల ఐటీని- విస్తరించి కొలువులిచ్చె
నిరంతర కరెంటిచ్చి- చీకట్లను పారదోలె
ప్రగతి పథం హోరులోన- సంక్షేమ జోరులోన
దేశానికి తెలంగాణ- దిక్సూచిగ నిలిచెరో.. ॥సారు॥
-డాక్టర్ కూర్మాచలం శంకరస్వామి, 77024 35110