గడియగడియకో బిడ్డ పానం వాయే
తల్లడిల్లి తల్లిపానం బొయ్యే
రైతన్న కండ్లల్ల రక్తపు యేరులుగారే
పాసిబోయిన బువ్వవెడుతు
అవ్వపడిన గోస ముందు సంద్రమే సిన్నబోయే
మారెను కాలం మారెను
మరో నవశకం మొదలాయేను
బాంచెనంటు వంగిన తలలు ఏర్రటి కెరటాలయ్యె
రక్తపు ఏరుల నుంచి మేఘాలు పుట్టుకచ్చె
యాసంగి వానకి ముసలి తాతకూడ రంకెలేసే
గుండెనరాలు తెగిపడుతున్నా
వదల్లేదు చేతి నుంచి జెండాని
నోటి నుంచి జై తెలంగాణ నినాదాన్ని ఆపలేదు
పద పద మని పరుగులు పెట్టే పసికూన కూడా
జంకని ధైర్యం సెప్పే ముసలితాత గూడ
పడిన కట్టం ఫలించింది
నేటికీ ఎనిమిదో ఎటయ్యింది…
ఏకమయ్యి సేసిన త్యాగానికి గంగమ్మ పొంగిపొర్లే
రైతన్నల కళ్లల్లో కన్నీళ్లు మాయమాయే
కల్యాణలక్ష్మితో కాంతి కిరణాలు అచ్చే
చిత్తుకాగితాల సంచుల్లో కొత్తా కాపీలు వచ్చె
అలమారాల బతుకుల్లో అందాలెన్నో పుట్టుకచ్చె
ఎనిమిదేళ్లలో అష్టలక్ష్ములు కొలువుదీరే
ధీరుల కట్టానికి కాలమే తలవంచే…
ఇంతటితో ముగిసేనని అనుకోకు మిత్రమా!
అందినదాన్ని వదలక కాపాడుకోవడం ముఖ్యం సుమా!
-కీర్తి పూర్ణిమ, 75699 04235