దృశ్యం రాల్చిన వాక్యం
ఓ సాయంకాల విరామ సమయాన ధ్యానముద్రలోనే తెరుచుకున్న నయనాలు
ఓ సాయంకాల విరామ సమయాన
ధ్యానముద్రలోనే తెరుచుకున్న నయనాలు
చూస్తున్న కొద్దీ రీల్స్లా దృశ్యాలు
సూర్యుడు గూట్లో వాలుతుండగ నీరెండ
నీలాకాశంలో కదిలిపోతున్న మబ్బు తెప్పలు
మేఘాల సందుల్లో బంగారు కాంతి తీగలు
నేల మీద పరుచుకున్న హాయి వాతావరణం
పచ్చని కొమ్మ చుట్టూర సీతాకోకచిలుకలు
అదే చెట్టు కొసన చేరిన పక్షుల కిచకిచలు
పక్కనే తేటతెల్లని ఉమ్మెత్త పువ్వుల నవ్వులు
ఊగే వాయిలి ఆకుల కమ్మని వాసన
సూర్యాస్తమయ సమయమే రసానుభూతి
మనుషుల్లోనూ అనురాగాల అనుసరణ
అనుభవాలు పండిన జంటలు కొన్ని
మాటాముచ్చైట్లె నడిచిపోతున్నట్లు
అనుభూతులు పంచుకుంటున్న దంటలవి
కలిసి నడకల్లో ఎన్నెన్ని గత కాలపు ఊసులో
చిన్నపిల్లల బూట్ల టకటక ధ్వనులు
కాళ్లల్ల కాళ్లు కలిసినట్టే పరుగులు
నడుస్తున్నంత మేరా తల్లుల నిగురాన్
బడి పోరలు చిన్నగ నడవరు, ఫాస్ట్ ఫాస్ట్
అతివలకు అందని ఆ బాల్యపు గావురాలు
వేగం మితిమీరినా భయం లేని యవ్వనం
రహదారుల మీద ఇష్టానుసార యానం
ఇదొక సాహసం అన్నట్టు చిరు దరహాసం
అటుఇటూ వాహనాలు పైకొట్టే జోరు హోరు
చూస్తున్న కొద్దీ కళ్ళ ముందన్నీ చిత్ర చిత్రాలే
ఆలోచనలను రూపు కట్టిస్తున్న పద పదాలు
కాయదం మీద కురుస్తున్న కవన వాక్యాలు
అన్నవరం, దేవేందర్
9440763479
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Horoscope | 14-10-2026 బుధవారం.. మీ రాశి ఫలాలు
ఆ 2,006 ఎకరాలపైనా విచారించండి.. రేవంత్ కుటుంబం, మంత్రులు, కాంగ్రెస్ నేతల భూములపైనా విచారణ జరుపాలి
అల్లుడి కోసం గిల్లుడు.. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం చుట్టూ బ్రోకింగ్ బాగోతం
బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
కరువుపై కాంగ్రెస్ సర్కార్ చోద్యం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

