కేంద్ర సాహిత్య అకాడమీ, ప్రభుత్వ సిటీ కళాశాల (హైదరాబాద్) సంయుక్త నిర్వహణలో జూలై 9వ తేదీ బుధవారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సిటీ కళాశాలలోని ఆజామ్ హాల్లో దాశరథి కృష్ణమాచార్యులు శతజయంతి సదస్సు జరుగనున్నది. ప్రారంభ సమావేశంలో సి.మృణాళిని స్వాగతోపన్యాసం, నందిని సిధారెడ్డి కీలకోపన్యాసం చేస్తారు. కళాశాల ప్రిన్సిపాల్ పి.బాలభాస్కర్ ముఖ్యఅతిథిగా, దాశరథి కుమార్తె ఇందిరా గౌరీశంకర్ గౌరవ అతిథిగా పాల్గొంటారు. కోయి కోటేశ్వరరావు అధ్యక్షత వహిస్తారు. గండ్ర లక్ష్మణరావు, ఏనుగు నరసింహారెడ్డి, ఆర్.సీతారామ్, కె.ప్రభాకర్, సిద్దంకి యాదగిరి, సమ్మెట విజయ, గరిపెల్లి అశోక్ వివిధ అంశాలపై పత్ర సమర్పణ చేస్తారు. మామిడి హరికృష్ణ సమాపన ప్రసంగం చేస్తారు. జె.నీరజ, కాకునూరి సూర్యనారాయణమూర్తి, అవధానం సుజాత వివిధ సాంకేతిక సమావేశాలకు అధ్యక్షత వహిస్తారు.
ప్రముఖ కవి కె.శివారెడ్డి యువ కవి పురస్కారానికి కవితా సంపుటాలను ఆహ్వానిస్తున్నాం. 2022, 2023, 2024 సంవత్సరాల్లో ముద్రితమైన కవితా సంపుటాల మూడు ప్రతులను 2025 ఆగస్టు 15లోపు ఇబ్రహీం నిర్గుణ్, 15-5-112/1/బీ, స్కైలైన్ టవర్స్ ఎదురుగా, చైతన్య నగర్, ఖమ్మం-507002, తెలంగాణ చిరునామాకు పంపించాలి.
2025, జూలై 12న హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో ‘నిశాచరుడి దివాస్వప్నం’ కవితా సంపుటి రచించిన మల్లారెడ్డి మురళీమోహన్‌కు రజనిశ్రీ సాహిత్య పురస్కారాన్ని అందజేయనున్నారు. ఈ కార్యక్రమంలో సి.పార్థసారథి, కసిరెడ్డి వెంకటరెడ్డి, మామిడి హరికృష్ణ, ఆచార్య ఎస్.రఘు, అన్నవరం దేవేందర్, జి.వి.శ్యామ్ ప్రసాద్ లాల్, మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్, పొన్నం రవిచంద్ర, డాక్టర్ గండ్ర లక్ష్మణరావు, వడ్లూరి ఆంజనేయరాజు, మావుడూరి సూర్యనారాయణమూర్తి, కేఎస్ అనంతాచార్య హాజరవనున్నారు.
2025 జూలై 13న హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఉదయం 10.30 గంటలకు కార్టూనిస్ట్ శేఖర్ స్మారక అవార్డుల ప్రదానం జరగనున్నది. 2025 సంవత్సరానికి గాను కార్టూనిస్ట్ మృత్యుంజయ, ఆర్టిస్ట్ చిత్ర పురస్కారాలను అందుకోనున్నారు. ఎస్.వినయకుమార్ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. కూర్మనాథ్ శేఖర్ స్మారకోపన్యాసం చేస్తారు. విశిష్ట అతిథులుగా డాక్టర్ తిప్పర్తి యాదయ్య, చింతల యాదగిరి, శంకర్, కూరెళ్ల శ్రీనివాస్, చంద్రకళా శేఖర్ పాల్గొననున్నారు.
సింహప్రసాద్ సాహిత్య సమితి ఆధ్వర్యంలో మహాకవి శ్రీశ్రీ స్మారక కథల పోటీ-2025 నిర్వహిస్తున్నాం. తలుపు గొళ్లెం, హారతి పళ్లెం, గుర్రపు కళ్లెం అనే అంశాలపై ఈ కథల పోటీ ఉంటుంది. కథలను 2025 ఆగస్టు 20వ తేదీలోపు సింహప్రసాద్ సాహిత్య సమితి, 401, మయూరి ఎస్టేట్స్, ఎం.ఐ.జి-2-650, కేపీహెచ్‌బీ కాలనీ, హైదరాబాద్-500072 చిరునామాకు లేదా srisri.kathalapotee@gmail.com కు పంపించాలి.