అన్నం పెట్టే రైతన్నకు వెన్ను దన్నుగ నిలిస్తే
మన్నులోంచి వెలిదీస్తడు
మణులూ, మాణిక్యాలు..
ఆరుగాలం కష్టించి స్వేదార్పణ గావించే
సేద్యమనే యజ్ఞానికి ఋత్విక్కులు కర్షకులు..
వొరాలెంట స్వరాలు కలుపు తీత కావ్యాలు
కుప్పల నూర్పిళ్ళ కథలు
తూర్పారబట్టే గాథలు
వెరసి మహ కృషీవలులు
వెలయించిన సిరుల నిలయం
వ్యవసాయ ఉద్గ్రంథాలయం
అన్నా.. రైతన్నా.. నీ వెంట నేనున్నా..
అన్నాడు కేసీఆర్ ఆర్థికంగా..హార్దికంగా
అహర్నిశలు రైతులకు అండదండలుగా
ప్రభుత్వాధిపతిగా కాక
బంధువుగా..ఆపద్బాంధవునిగా
ఆదుకుని అందించే
కరావలంబం..రైతుబంధు పథకం..
మట్టి దిబ్బలన్ని మాగాణులైతే
చెలకలన్ని పంట చేలుగా మారితే
చెర్లు కుంటలన్ని జలకళ సంతరిస్తే
రైతు మొగాన చిరునవ్వు చిందిస్తే
కృషితో నాస్తి దుర్భిక్షం అని నినదిస్తే
కష్టేఫలి నానుడి ప్రతిధ్వనిస్తే
అది బాపూ కేసీఆర్ తపఃఫలం
జీవజాలానికి పంటనిచ్చే భూమాత,
భూమిని సేద్యంతో
ఫలదీకరింపజేసే కర్షకుడు,
కృషీవలునికి చేయూతనిచ్చే ప్రభుత,
ప్రభుత్వాన్ని నడిపే పరిపాలకుడు,
అందరూ ఈ యజ్ఞంలో ఋత్విక్కులే
వేదమైనా, ఖురానైనా, బైబిలైనా
రైతును అన్నదాతగా శ్లాఘిస్తుంది..
పెద్దపీట వేసి ప్రశంసిస్తుంది
విశ్వకవి రవీంద్రుడన్నట్టు..
ఈ మంత్రాలు, జపమాలలు
పక్కనపెట్టి.. హలం పట్టి , పొలం దున్నే
రైతన్నను ఉపాసిస్తే..
ఉపవాసాలుండవు
ఉపాధులకు కొరత ఉండదు..
సస్యశ్యామల దేశానికి
వెన్నెముక అన్నదాత
రైతుబంధు పథకం అతనికి సాయం
రైతుబీమా అతని పరిరక్షణ ..
రైతుబాంధవుడు చంద్ర శేఖరుడు
అందించే ఆలంబన..
ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే
వేల మెగావాట్ల విద్యుత్తు
అదే ప్రజాసంక్షేమ పథకాల మహత్తు
హలాయుధుడు బలరాముడు
అతని వెంట శ్రీకృష్ణుడు
హలాయుధుడు రైతన్న
అతనినంటి మన బాపూ..
మాగాణి తేజస్సును
మసక బారనీయకుండా
వెన్నుదన్నుగా నిలచిన
విజయసారథులు వీరు
సేద్యం ఎరిగిన కాపు..
ఇతడే రైతుకు ప్రాపు
ఇతడంటే మన బాపు
ఉద్యమానికొక ఊపు..
విజయ సారథి ఇతడు
బాపూజీ కలలుగన్న
రామరాజ్యమేదంటే..
మా బాపూ కేసీఆర్
కలల పంట
గ్రామ రాజ్యం..
రైతుబంధు, రైతుబీమా
పథకాలతో సత్కారం.
రైతే రాజనిపించే
భావానికి శ్రీకారం
మంత్రి శ్రీదేవి