నీరటిగాడు
కవంటే... ఎవడనుకున్నారు భావాల నీటి ధారలను
కవంటే… ఎవడనుకున్నారు
భావాల నీటి ధారలను
అక్షరాల మడులకు మర్లేసే
కవిత్వ పంటల నీరటిగాడు
అక్షరాలను నాటినప్పటి నుంచి
కవిత్వ పాదాల మడికట్ల మీదుగా
పరికించి పరికించి చూస్తూ నడుసుకుంటూ పోతాడు
ఏడన్న అక్షరాలకు భావాల తడి తాకక వల్లిపోతా ఉంటే
అక్షరాలకన్నా ముందుగాల కవి
జీవిడిశినంతగా విలవిలలాడుతాడు
ఒక్కొక్క పాదం నిండు జీవంతో ఎదుగుతా ఉంటే
కలల పంటను ఊహించుకుంటూ తానూ
మందిలోనే నిండు కళ్లమోలే ఎలుగుతాడు
ఏ కవి శేన్ల అక్షరాలకు భావపు జల తగ్గినా
వీడు కాసింత భావపు నీటిని మర్లేద్దామనుకుంటాడు
ఏ కవి అక్షరాల పంట ఎండిపోతున్నా
వాడు గిలగిలలాడుతాడు
ఏ కవి అక్షరాల పంట నిండుగా పండినా
నిండుమనసుతో వాని కళ్లల్లో ఎలుగులు నింపుకొంటడు
వాడు శుద్దాలంకారపు పురుగుమందులు సల్లి
కవిత్వ పంటల సాగు చెయ్యడు
నిజ జీవిత అనుభవాల సహజ ఎరువులనేసి
పచ్చని బతుకు కవిత్వపు పంటలు సాగుజేస్తాడు
నేలంతా పచ్చని కవిత్వమై కళ్లు దెరిస్తే
ఆ కళ్లల్లో వాడు రేపటి కొత్త కలలు కంటాడు!
దిలీప్.వి
84640 30808
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

