టాబ్లెట్ బాక్స్
డైనింగ్ టేబుల్ మీదకు కొత్త అతిథి టాబ్లెట్ బాక్స్
డైనింగ్ టేబుల్ మీదకు
కొత్త అతిథి టాబ్లెట్ బాక్స్
పాన్ డబ్బాను తోసేసి
తన స్థానం శిలాఫలకం వేసుకుంది
అన్నం గిన్నె కంటే
టాబ్లెట్ బాక్స్ పెద్దది ఇప్పుడు
ప్రతి భోజనానికీ
అఫిక్స్, సఫిక్స్ మాత్రలు
పక్కా గోలీ మింగాల్సిందే
మూడు పూటలు ముచ్చటగా
తీరొక్క రంగుల ఆకారాలు
తీపి రోగాలకు అల్సర్ పోరాటానికి
గుర్తులు పెట్టుకుని గుటుక్కు మని
గుండె చివరి చరణం వరకూ…
ప్రతి ప్రయాణంలో తోడు అదే
మరిచిపోయానంటే మళ్లీ వెనక్కు
పిల్లల తొలి ఆత్మీయ పలుకు గోలీలదే
వేసుకోలేదంటే చిరు మందలింపు
పింఛన్ అంతా ఊడ్చుకుపోతుంది
పిల్లలను అడగాలంటే అహం అడ్డు
ఆదాయం లేని వాళ్ల అగచాట్లు ఎన్నో
నీళ్లు మింగి దేవునిపై భారం వేయడమే
ఇంతింతై… అన్నట్టుగా
టాబ్లెట్ బాక్స్ ఎదిగి ఎదిగి
కాఫిన్ బాక్స్‌ను దాటేటట్టుంది
మట్టిని దేహం మీద కప్పుకొనే లోపు
చితిలో కూడా
నా చెయ్యి తడుముతూనే ఉంటుందేమో
టాబ్లెట్ బాక్స్ కోసం
ఎక్కడ పెట్టి సచ్చానని…
దాసరి మోహన్
99853 09080
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

