తాటికొండాల నరసింహారావు సాహిత్య వ్యాసాల సంపుటి – ఆవర్తనం – ఆవిష్కరణ సభ సెప్టెంబర్ 5వ తేదీ సాయంత్రం ఆరు గంటలకు హైదరాబాద్ రవీంద్రభారతిలో జరుగుతుంది. అకాడమీ సాహిత్య వారంలో భాగంగా జరిగే ఈ సభలో డా.కె.వి.రమణాచారి ఆ పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు.
సభకు సాహిత్య అకాడమీ కార్యదర్శి నామోజు బాలాచారి అధ్యక్షత వహిస్తారు. సభలో డా.ఏనుగు నరసింహారెడ్డి, డా.కొండపల్లి నీహారిణి, కె. ఆనందాచారి, సమ్మెట విజయ, వంశీకృష్ణ, నీలిమ వి.ఎస్.రావు ప్రసంగిస్తారు.