గునుగు పూల వ్యామోహం
అమ్మ ఇచ్చిన టాస్క్ అది వాడలో ఈసారి మన బతుకుమ్మ ఎవరెస్ట్‌లా నలుగురు ఎత్తి తలపై పెట్టితే నడుము వంగి వంతుల వారీగా మోయాలి
అమ్మ ఇచ్చిన టాస్క్ అది
వాడలో ఈసారి మన బతుకుమ్మ ఎవరెస్ట్‌లా
నలుగురు ఎత్తి తలపై పెట్టితే
నడుము వంగి వంతుల వారీగా మోయాలి
చెరువు చేరేవరకు చమటలు పట్టాలి
సైకిల్ సవారి రోజూ చేను వైపు
గోనె సంచులు కుక్కి కుక్కి
అన్న తొక్కిన కదలని చక్రం
నెట్టుకుంటూ గుమ్మం చేరి గుమ్మరించీ
చెల్లె ఎక్కిరించేది చాట కూడా కాలేదని
అమ్మ కాడలు కత్తిరించి కలర్ అద్దినంక
తాంబూలంలో ఇంద్రధనుస్సు వెలసింది
అసలు పోటీ తంగేడు దగ్గరే
కొందరు కొమ్మలు కొమ్మలు విరిచి
తొందరలో పూలు నేలపైనా రాల్చి
వాడిపోతే అమ్మమ్మ చివాట్లు
నిజంగా తంగేడు బంగారమే మరి
మా ఇంటి తీగనే కాని
తెల్లవారే సరికి బీరపూలు మాయం
పచ్చని ఆకులపైన కండ్లు ఎందరివో
పండుగ పూట తిట్ల పురాణం వద్దని
మిగిలినవి ఎగిరి ఎగిరి తెంపినం
గౌరవంతో గౌరమ్మ చెంతన చేరాయి
రహస్య దాడి అల్లిపూలపైన
అలారం పెట్టుకొని చీకట్లోనే వేట
అన్న హీరోలా చెరువంతా గాలించి
నాకూ ఈతరాదని గట్టు మీదనే కూచోబెట్టి
చేతుల నిండా పట్టుకొని
తెల్లవారేసరికి అమ్మ ఒడిలో
సద్దుల బతుకమ్మల ప్రదర్శన జెండా దగ్గర
ఒక్కో బతుకమ్మ వరుసలో చేరుతుంటే టెన్షన్
నాన్న రిక్షాలో తీసుకువచ్చాడు పెద్ద బతుకమ్మను
అమ్మ గర్వంగా సెంటర్లో పెట్టి మావైపు చూసింది
అన్నా నేను అమ్మను గెలిపించాం వాడకట్టులో
నోటినిండా సత్తు పిండి తీయదనం సంతోషంగా..
-దాసరి మోహన్
99853 09080
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

