నేటి యువత కొరియన్ బ్యూటీకి జైకొడుతున్నది. అందులోనూ ‘హనీ స్కిన్’ కోసం తెగ ఆరాటపడుతున్నది. తేనెలా మెరిసే చర్మం, మృదువుగా, తేమతో నిండి ఉండటం.. ఈ హనీ స్కిన్ ప్రత్యేకత. అయితే, ఇది కేవలం పైపైన వేసుకొనే మేకప్ వల్ల వచ్చే మెరుపు కాదట. చర్మం లోపలి నుంచి ఆరోగ్యంగా ఉండటం వల్ల వచ్చే సహజమైన కాంతి అని బ్యుటీషియన్లు చెబుతున్నారు. ఈ ‘హనీ స్కిన్’ గ్లోను సాధించాలంటే.. ఈ చిట్కాలు పాటించాలని అంటున్నారు.