నార్నూర్ : నీటి కుంటల ( Water ponds ) నిర్మాణంతో భూగర్భ జలాలను ( Groundwater levels ) పెంపొదించుకోవచ్చని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజార్షి షా ( Collector Rajarshi Shah ) అన్నారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం గుంజాల గ్రామంలో వాటర్ సెడ్ నాబార్డ్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నీటి కుంట ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలో కిచెన్ గార్డెన్ ను పరిశీలించారు
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ నీటి కుంటల ఏర్పాటుతో భూగర్భ జలాలు పెంపొందించి రెండు పంటల దిగుబడిని పొందవచ్చని రైతులకు సూచించారు. నీతి అయోగ్‌లో భాగంగా నార్నూర్ ను అభివృద్ధిలో ఆదర్శంగా తీర్చిదిందేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
కిచెన్ గార్డ్ ఏర్పాటుచేసిన పాఠశాల ఉపాధ్యాయులను అభినందించారు. కార్యక్రమంలో సర్పంచ్ జ్ఞానేశ్వర్. తహసీల్దార్ జాడి రాజా లింగం, డీఎల్పీవో ప్రభాకర్, ఎంపీడీవో పుల్లారావు, వాటర్ షెడ్ డీడీఎం రౌత్ ఆఫ్, వ్యవసాయ అధికారి ఆకాష్, ఎంఈవో మనోహర్, డీఈ శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి రాధిక తదితరులున్నారు.