ఇటీవల వచ్చిన డ్యూడ్ మూవీ చూసే ఉంటారుగా. అందులో హీరో ప్రేమించిన అమ్మాయి పెళ్లికి వెళ్లడం, పొరపాటున ఆ అమ్మాయి మెడలో తాళి తెంచడం, గొడవ జరగడంపై ఓ ఫన్నీ సీన్ ఉంటుంది. మూవీలో ఇదంతా సరదాగానే చూపించారు గానీ, బ్రేకప్ బాధను భరించడం అంత ఈజీ ఏమీ కాదు. అసలు ఈ బ్రేకప్ సమయంలో ఎలా అనిపిస్తుంది. దాని నుంచి ఎలా బయట పడాలో తెలుసుకోండి మరి. ఈ రోజుల్లో ఇది నీకు చాలా అవసరం డ్యూడ్!
ప్రేమలో పడటం ఎంత సులభమో, దాని నుంచి బయటపడటం, బ్రేకప్ తర్వాత ఆ బాధను తట్టుకోవడం
అంతే కష్టం. ప్రేమ విఫలమైనప్పుడు కలిగే నొప్పి కేవలం భావోద్వేగపరమైనది మాత్రమే కాదు.
అది శారీరక, మానసిక ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. బ్రేకప్ అనేది జీవితంలో
ఒక చిన్న ఘట్టం మాత్రమే, కానీ ఆ సమయంలో అది ప్రపంచం అంతమైపోయినంత బాధను కలిగిస్తుంది.
బ్రేకప్ బాధ అంటే ఏమిటి?
ప్రేమ బంధం తెగిపోయినప్పుడు కలిగే వేదనను ‘బ్రేకప్ పెయిన్’ అంటారు. ఇది అనేక రూపాల్లో ఉంటుంది.
మెదడులో ఏం జరుగుతుంది?
బ్రేకప్ అయినప్పుడు మెదడులో జరిగే మార్పులు మాదకద్రవ్యాల వ్యసనాన్ని ఆపేసినప్పుడు కలిగే లక్షణాలను పోలి ఉంటాయి. ఎందుకంటే ప్రేమ అనేది మెదడులోని రివార్డ్ సిస్టమ్‌తో ముడిపడి ఉంటుంది.
1. డోపమైన్ తగ్గుదల
ప్రేమలో ఉన్నప్పుడు లేదా మీ భాగస్వామి గురించి ఆలోచించినప్పుడు, మెదడులోని డోపమైన్ స్థాయిలు పెరుగుతాయి. డోపమైన్ అనేది ఆనందం, ప్రేరణ, సంతృప్తి అనుభూతిని కలిగించే ముఖ్యమైన న్యూరోట్రాన్స్మిటర్. బ్రేకప్ అయిన వెంటనే ఈ డోపమైన్ ప్రవాహం ఒక్కసారిగా ఆగిపోతుంది. దీనివల్ల మెదడు ఏదో తీవ్రంగా కోల్పోయిన అనుభూతికి లోనవుతుంది. డోపమైన్ లేకపోవడం వల్ల నిరాశ, ఆందోళన, శూన్యత, మళ్లీ వారిని కలవాలనే తీవ్రమైన కోరిక కలుగుతుంది. ఇది ఒక రకమైన విత్‌డ్రాయల్ సిండ్రోమ్లాగా ఉంటుంది.
2. నొప్పి క్రియాశీలత
బ్రేకప్ అయినప్పుడు కలిగే మానసిక నొప్పి, మెదడులో శారీరక నొప్పిని అనుభవించే ప్రాంతాలు ఇన్సులా, యాంటీరియర్ సింగులేట్ కార్టెక్స్లను ప్రేరేపిస్తుంది. అందుకే బ్రేకప్ అయినప్పుడు చాలామందికి గుండె బద్దలైనట్లు అనిపిస్తుంది. ఇది గుండె కండరాలను తాత్కాలికంగా బలహీనపరిచే తీవ్రమైన ఒత్తిడి వల్ల వస్తుంది.
3. స్ట్రెస్ హార్మోన్లు పెరగడం
బ్రేకప్ ఒక తీవ్రమైన ఒత్తిడి లాంటిది. ఈ సమయంలో శరీరంలో అడ్రినలిన్, కార్టిసాల్ వంటి స్ట్రెస్ హార్మోన్లు విడుదలవుతాయి. ఈ హార్మోన్ల వల్ల గుండె వేగంగా కొట్టుకోవడం, నిద్రలేమి , రోగనిరోధక శక్తి తగ్గడం, ఆందోళన వంటి లక్షణాలు కనిపిస్తాయి.
4. భావోద్వేగ నియంత్రణ లోపం
ప్రేమ విఫలమైనప్పుడు, మెదడులో సమస్యలను పరిష్కరించడం, భావోద్వేగాలను నియంత్రించడంలో సాయపడే భాగం ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ పని తీరు మందగిస్తుంది. దీనివల్ల బాధ, కోపం వంటి భావోద్వేగాలను నియంత్రించడం కష్టమై, అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడం, తమను తాము నిందించుకోవడం జరుగుతుంది. కాలక్రమేణా మెదడు ఈ మార్పులకు అలవాటుపడి కోలుకుంటుంది. దీనిని న్యూరోప్లాస్టిసిటీ అంటారు.
బయటపడటం ఎలా?
బ్రేకప్ బాధ నుంచి బయటపడటానికి ఒక నిర్దుష్ట సమయం అంటూ లేదు. కానీ, కొన్ని చిట్కాలు ఈ ప్రయాణాన్ని సులభతరం చేస్తాయి.
చివరిగా, బ్రేకప్ అనేది జీవితంలో అంతం కాదు, అది ఒక కొత్త ఆరంభం. బ్రేకప్ వల్ల మీపై మీరు శ్రద్ధ పెట్టడం, మీ లక్ష్యాలను చేరుకోవడంపై దృష్టి సారించడం నేర్చుకుంటారు. కొంచెం సమయం పడుతుంది, కానీ తప్పకుండా మీరు ఆ బాధ నుంచి బయటపడతారు.
బి. కృష్ణ, సీనియర్ సైకాలజిస్ట్
ఇగ్నిషియో చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్,
హైదరాబాద్, 99854 28261