ప్రతిరోజూ మనం ఏదో ఒక డేటింగ్ ట్రెండ్ గురించి వింటూనే ఉంటాం. ఇప్పుడు ఒక కొత్త ట్రెండ్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. అదే ‘వైల్డ్ ఫ్లవరింగ్’. ఈ పేరు కొంచెం వింతగా అనిపించవచ్చు. కానీ, 2026లో అత్యంత ఆదరణ పొందిన బెస్ట్ డేటింగ్ ట్రెండ్ ఇదే. ఇప్పటివరకు ఈ ట్రెండ్ పేరును విన్నవారు అతికొద్ది మంది మాత్రమే ఉంటారని అంచనా. డేటింగ్ అనగానే.. ఒక పర్ఫెక్ట్ ప్రొఫైల్ పెట్టుకుని, ఎదుటివారిని ఇంప్రెస్ చేసి, సరైన మ్యాచ్‌ను వెతుక్కోవాలనే ఒక రకమైన రేస్ ఉంటుంది. కానీ వైల్డ్ ఫ్లవరింగ్ ట్రెండ్ దానికి పూర్తి భిన్నం. అడవి పూలు ఎలాంటి ఒత్తిడి లేకుండా, ఎవరూ పెంచకపోయినా ప్రకృతిలో వాటంతట అవే ఎంత సహజంగా వికసిస్తాయో ఈ ట్రెండ్‌లో ప్రేమను కూడా అంతే సహజంగా చిగురించేలా చేస్తారు. ఈ బంధం ఎకడికి దారి తీస్తుంది? అని అతిగా ఆలోచించకుండా… ఈ ప్రయాణం ఆనందంగా ఉందనే స్వేచ్ఛా భావనతో ఉండటమే ఈ ట్రెండ్ ముఖ్య ఉద్దేశం.
పేరులో ఉన్నట్లుగానే, అడవి పూలు వికసించే తీరు దీనికి స్ఫూర్తి. వెంటనే కమిట్మెంట్ కావాలనే ఒత్తిడి లేకుండా, ప్రతి అడుగును ఒక లెకలా భావించకుండా బంధాన్ని ఏర్పరుచుకోవడమే ఈ విధానం. మోడ్రన్ డేటింగ్లో ఘోస్టింగ్ (హఠాత్తుగా మాట్లాడటం మానేయడం), సిట్యుయేషన్ షిప్ (స్నేహమా, ప్రేమా అని పేరు పెట్టలేని అయోమయం) లాంటి వాటి వల్ల, అలాగే త్వరగా సెటిల్ అవ్వాలనే ఒత్తిడి వల్ల చాలామంది అలసిపోయారు. ఈ వైల్డ్ ఫ్లవరింగ్ అనేది వారికి ఒక విశ్రాంతిని ఇచ్చి, ఎలాంటి ఆందోళన లేకుండా ప్రేమలో పడే అందమైన ప్రయాణాన్ని ఆస్వాదించేలా చేస్తున్నది. ఇందులో మిమ్మల్ని మీరు ఈ విధంగా మార్చుకోవాలనే కండిషన్లూ ఉండవు. ఎలాంటి తొందర, ఒత్తిడి లేకుండా ఇద్దరికీ మానసిక ప్రశాంతతను ఇచ్చే సేఫ్ స్పేస్‌ను క్రియేట్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఈ తరహా డేటింగ్ అంటే ఒక చెక్ లిస్ట్‌లా ఉండదు. సరదాగా, క్లియర్‌గా సాగిపోతుంది. సర్వేల ప్రకారం 47% మంది ఈ సహజమైన వైల్డ్ ఫ్లవరింగ్ విధానానికి ఓటు వేస్తున్నారట.