యశ్ కథానాయకుడిగా నటిస్తున్న ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’ సినిమాపై ఇప్పటికే భారీ హైప్‌క్రియేట్ అయింది. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఆగస్ట్ 26న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమాలో యశ్ జోడీగా ఐదుగురు కథానాయికలు నటించారు. నదియా పాత్రలో కియారా అద్వాణీ కనిపించనుంది.
ఈ సినిమాలోని తొలిగీతం ‘తబాహీ’ వీడియోను బుధవారం విడుదల చేశారు. ఇందులో యశ్, కియారా అద్వాణీ కెమిస్ట్రీ హైలైట్‌గా నిలిచింది. విజువల్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ‘లోకం సంకెళ్లు తెంచేద్దాం..కాలం పరదాలు కాల్చేద్దాం..మనకై మనమై జీవించుదాం..తబాహీ’ అంటూ ఈ పాట సాగింది.
విశాల్ మిశ్రా స్వరపరచిన ఈ పాటను తెలుగులో రామజోగయ్యశాస్త్రి రచించారు. ‘తబాహీ’ సాధారణ ప్రేమగీతం కాదని, ప్రేమలోని త్యాగం.. భావోద్వేగాలను ప్రతిబింబిస్తుందని, గాఢమైన ప్రణయభావాల్ని ఈ పాటలో ఆవిష్కరించామని సంగీత దర్శకుడు విశాల్మిశ్రా తెలిపారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమవుతున్నది.