వివో.. విప్లవాత్మక స్మార్ట్ఫోన్లు తీసుకురావడంలో ఎప్పుడూ ముందుంటుంది. అత్యాధునిక ఫీచర్లు అందిస్తూ.. టెక్ ప్రపంచంలో సరికొత్త బెంచ్‌మార్క్‌లను సృష్టిస్తుంది. తాజాగా, అత్యంత శక్తిమంతమైన ‘వివో ఎక్స్ ఫోల్డ్-6’ను చైనాలో విడుదల చేసింది. త్వరలోనే భారత్‌తోపాటు గ్లోబల్ మార్కెట్లోనూ అందుబాటులోకి తీసుకురానున్నది. ఇప్పటికే ఈ ఫ్లాగ్షిప్ మాడల్.. తన ప్రత్యేకమైన ఫీచర్లతో ఇంటర్నెట్లో ట్రెండింగ్‌లో ఉంది.
ఈ ఫోల్డబుల్ ఫోన్ చాలా సన్నగా, అన్ఫోల్డ్ చేసినప్పుడు కేవలం 4.4 మిమీ మందం, 228 గ్రాముల బరువుతో చాలా తేలికగా ఉంటుంది. 8.02 అంగుళాల మెయిన్ డిస్ప్లే.. 120Hz రిఫ్రెష్ రేట్, హెచ్డీఆర్ 10+, డాల్బీ విజన్ సపోర్ట్‌తో వస్తున్నది. బయటి వైపు 6.51 అంగుళాల కవర్ స్క్రీన్ ఉంది. హై-ఎండ్ గేమింగ్, మల్టీటాస్కింగ్ కోసం ఈ ఫోన్లో శక్తిమంతమైన మీడియాటెక్ డైమెన్సిటీ 9500 సూపర్ ఎడిషన్ ఆక్టా-కోర్ ప్రాసెసర్‌ను అమర్చారు. స్లిట్ స్క్రీన్, ఫ్లోటింగ్ విండోస్ వంటి మల్టీటాస్కింగ్ ఫీచర్లు ఇందులో అద్భుతంగా పనిచేస్తాయి. ఈ ఫోన్లోని కెమెరా సెటప్‌ను ప్రఖ్యాత జీస్ భాగస్వామ్యంతో తీర్చిదిద్దింది.
వెనుక భాగంలో 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా (ఓఐఎస్ సపోర్ట్‌తో), 50 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్, 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫొటో లెన్స్ (3 ఎక్స్ ఆప్టికల్ జూమ్)ను ఏర్పాటు చేసింది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇన్నర్, కవర్ స్క్రీన్లపై విడివిడిగా రెండు 20 మెగాపిక్సెల్ కెమెరాలను అందిస్తున్నది.
ఈ ఫ్లాగ్షిప్ మోడల్లో 7,000 ఎంఏహెచ్ సామర్థ్యం కలిగిన బ్యాటరీని ఉంది. దీనిని వేగంగా చార్జ్ చేయడానికి 80W ఫాస్ట్ చార్జింగ్, 40W వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ అందిస్తున్నది. ఇతర గ్యాడ్జెట్లను చార్జ్ చేయడానికి రివర్స్ చార్జింగ్ సపోర్ట్ ఉంది. ఇక గూగుల్ జెమిని ఇంటిగ్రేషన్, ఏఐ ఇమేజ్ స్టూడియో, ఏఐ మ్యాజిక్ మూవ్ వంటి అధునాతన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ కూడా ఇందులో ఉన్నాయి. ఐపీ 59 రేటింగ్‌తో నీటి తుంపరలు, ధూళి నుంచి రక్షణ లభిస్తుంది. వైఫై 7, 5జీ, బ్లూటూత్ v5.4 లాంటి కనెక్టివిటీ ఆప్షన్లు ఉన్నాయి. ఈ ప్రీమియం ఫోల్డబుల్ ఫోన్ ధర సుమారు రూ. 1,59,999 వరకు ఉండవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.