మన ఆనందం ప్రకృతిని బాధపెట్టకూడదు. మన ముస్తాబు పర్యా వరణానికి విఘాతం కలిగించకూడదు. మనవల్ల భూగర్భ జలాలు అంతరించే స్థితికి చేరుకోకూడదు. మనమంటే మనందరం! యావత్ ప్రపంచ ఫ్యాషన్ ప్రియులం.
క్షణక్షణానికి మారిపోయే ఫ్యాషన్ల కారణంగా.. దుకాణాల్లో పాత దుస్తులు పేరుకుపోతున్నాయి. వాటి తయారీకి ఎన్ని రంగులు వినియోగించారో, ఎంత పత్తిని వాడారో? యంత్రాలు పనిచేయడానికి ఎంత విద్యుత్ ఖర్చయిందో? అంతా వృథా. ఆయా పరిశ్రమల కారణంగా ఎంత కాలుష్యం ప్రకృతిలో కలిసిపోయిందో? ఎంత గాలి విషపూరితంగా మారిపోయిందో? ఆ లెక్కలు తీస్తే.. ఫ్యాషన్‌ను మించిన అరాచకం లేదేమో అనిపిస్తుంది.
ఇదేం పరిష్కారం లేని సమస్య కాదు. అది కూడా మీ చేతుల్లోనే ఉంది.