Household Tips | బాత్రూమ్ అలంకరణకు వేలకువేలు ఖర్చుపెడతాం కానీ, కొత్త తువ్వాలు కొనడానికి మాత్రం వెనకా ముందూ ఆలోచిస్తాం. కొన్నా.. నాసిరకానికే ఓటేస్తాం. ఇది మంచి పద్ధతి కాదంటున్నారు నిపుణులు.
సాధ్యమైనంత వరకూ కాటన్ తువ్వాలే కొనండి. రెండో ఎంపిక మైక్రోఫైబర్ తువ్వాళ్లు. ఇవి తేలిగ్గా ఉంటాయి. ఇట్టే ఆరిపోతాయి. ఈ మధ్య వెదురు గుజ్జుతోనూ చేస్తున్నారు. పర్యా వరణ ప్రియులకు ఈ తువ్వాళ్లు నచ్చుతాయి.
మన అవసరాలను బట్టి తువ్వాలు పెద్దగా ఉండాలా, చిన్నగా ఉండాలా అన్నది నిర్ణయించుకోవాలి. ఒంటికి సౌకర్యవంతంగా చుట్టుకునేలా ఉంటే ఉత్తమం. మరీ పెద్దవైతే దుప్పటిని తలపిస్తాయి.
నీటిని ఎంత బాగా పీల్చుకుంటే అంత మంచి తువ్వాలు కింద లెక్క. ఈజిప్ట్ కాటన్‌తో చేసినవి అంతర్జాతీయ మార్కెట్లో బాగా అమ్ముడవుతున్నాయి. కాకపోతే ఖరీదు ఎక్కువ.
అంచుల దగ్గర కుట్లు ఊడిపోతే తువ్వాలు పాతబడిపోయినట్టు అనిపిస్తుంది. ధర ఎక్కువైనా డబుల్ స్టిచ్ ఉన్నవాటినే కొనండి.
చివరగా..స్టైల్ కూడా ముఖ్యమే. మీ ఒంటి రంగుకు నప్పేవే తీసుకోండి. మీ బాత్రూమ్ టైల్స్‌తో కలిసిపోయే డిజైన్లు అసలే వద్దు.