వేసవిలో ఏదైనా చల్లచల్లగా తాగేందుకే ఇష్టపడతారు. జ్యూస్లోనైనా, మజ్జిగలోనైనా రెండుమూడు ఐస్ ముక్కలు వేసుకొని మరీ లాగించేస్తుంటారు. ఇక కూల్‌డ్రింక్స్ సరేసరి. ఇలా చల్లని పానీయాలు.. పళ్లను బలహీనపరుస్తాయని డెంటిస్ట్‌లు హెచ్చరిస్తున్నారు. ఒక్క ‘స్ట్రా’ సాయం తీసుకుంటే.. దంతాలను ‘స్ట్రాంగ్’గా ఉంచుకోవచ్చని చెబుతున్నారు. ఇష్టంగా తాగే పానీయాలను ఆస్వాదిస్తూనే.. దంతాలను రక్షించుకోవడంలో ‘స్ట్రా’ ముందుంటుందనీ అంటున్నారు.