మండు వేసవిలో ఎండ వేడిమిని తప్పించుకోవడానికి కాటన్ దుస్తులకు మించిన మార్గం లేదు. అందుకే ఫ్యాషన్ కూడా ఈ కాలంలో ఆ దారిలోనే అడుగులేస్తుంది. ఇక చేనేత వస్త్రమైన ఖాదీని అమితంగా ఆదరించేవారూ ఎంతోమంది.
గులాబీ గోధుమ వన్నెల కలబోతగా క్రోచెట్ లేస్, తెలుపు పూల ఎంబ్రాయిడరీ జోడించిన ఈ చీర కూడా ఆర్గానిక్ ఖాదీతో ప్రాణంపోసుకున్నదే. మ్యాచింగ్ ఖాదీ జాకెట్టుతో కనికట్టు చేశారు డిజైనర్. దీంతో అలంకరణకు పరిపూర్ణత వచ్చింది. ఖాదీ అంటేనే భారతీయత. ఖాదీ చీర కట్టుకోవడమంటే.. పదహారణాల దేశీ సౌందర్యమే. అన్నట్టు, చీరకట్టు సింగారించుకున్న ఈ కాంతామణి టాలీవుడ్ హీరోయిన్ పూర్ణ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదూ!