HomeLifestyleThe Things That Must Be Consumed During The Summer Curd And Buttermilk Top The List
పెరుగా?! మజ్జిగా?!
వేసవిలో తప్పకుండా తీసుకోవాల్సిన వాటిలో పెరుగు, మజ్జిగ ముందుంటాయి. మండే ఎండల్లో ఈ రెండూ ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తాయి.
వేసవిలో తప్పకుండా తీసుకోవాల్సిన వాటిలో పెరుగు, మజ్జిగ ముందుంటాయి. మండే ఎండల్లో ఈ రెండూ ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తాయి. అయితే, సందర్భాన్ని బట్టి వీటిలో ఏది తీసుకోవాలో నిపుణులు సలహా ఇస్తున్నారు.
మజ్జిగ..
డీహైడ్రేషన్‌ను నివారించడంలో మజ్జిగ ముందుంటుంది. ఇందులో దాదాపు 90 శాతం నీరు ఉంటుంది. ఎండల వల్ల శరీరం కోల్పోయే నీటి శాతాన్ని ఇది భర్తీ చేస్తుంది.
ఎసిడిటీ సమస్యలు ఉన్నవారికి మజ్జిగ మంచి ఎంపిక.
మజ్జిగలో కొవ్వు శాతం తక్కువ. కాబట్టి, దీన్ని తీసుకుంటే జీర్ణవ్యవస్థపై భారం పడదు. భోజనం తర్వాత మజ్జిగ తాగితే అజీర్ణం, గ్యాస్ సమస్యలు రాకుండా ఉంటాయి.
ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు శరీరం త్వరగా చల్లబడాలంటే.. మజ్జిగ తాగడమే మంచిది.
ఎండ వల్ల వచ్చే నీరసాన్ని తగ్గించడంలో మజ్జిగలో ఉండే క్యాల్షియం, పొటాషియం, విటమిన్లు సాయపడతాయి.
పెరుగు..
పెరుగులో ప్రొటీన్లు, కొవ్వులు ఎక్కువ. అధిక శక్తి కావాలనుకునే వారు, బరువు పెరగాలనుకునే వారికి ఉపయోగం.
పరగడుపున పెరుగు తీసుకోవడం వల్ల కడుపులో మంట తగ్గుతుంది.
రాత్రిపూట పెరుగు తీసుకోవద్దని ఆయుర్వేదం చెబుతున్నది. అలాచేస్తే వేసవిలో కూడా కఫం పెరిగే అవకాశం ఉంటుంది.