ప్రేమ పసిబిడ్డ లాంటిది, పసి మొక్క లాంటిది. జాగ్రత్తగా సంరక్షించుకోవాలి. ఇష్టంగా సాదుకోవాలి. ఆ ప్రయత్నంలో ఓ ఐదు ప్రేమ భాషలను భర్తలకు పరిచయం చేస్తున్నారు ‘ఫైవ్ లవ్ లాంగ్వేజెస్’ రచయిత గ్యారీ చాప్మన్.
వంట పనిలో దూరండి. బట్టలు ఉతకడంలో సాయం చేయండి. వారాంతంలో దుమ్ము దులిపి ఆమెకు శ్రమ తప్పించండి.
పెళ్లిరోజు, పుట్టినరోజు తదితర ప్రత్యేక సందర్భాల్లోనే కాదు.. ఆఫీసు నుంచి ఇంటికి వస్తూ వస్తూ కూడా ఏదైనా కానుక తీసుకెళ్లొచ్చు. ఆమెను సర్ప్రైజ్ చేయవచ్చు.
తను ప్రత్యేకంగా అలంకరించుకున్నప్పుడు ప్రశంసించండి. తన చేతి వంట బాగా కుదిరినప్పుడు మనసారా మెచ్చుకోండి. తన పట్ల మీ ప్రేమను వ్యక్తం చేయండి. తను ఊరికి వెళ్లినప్పుడు ఎంతగా మిస్ అవుతారో
కవితాత్మకంగా వివరించండి.
ఓ భర్త ప్రపంచంలోనే ఖరీదైన గడియారాన్ని తన భార్యకు కానుకగా ఇచ్చాడు. ‘ఇంతకంటే విలువైంది కావాలి. మీ సమయం’ అని సూటిగా జవాబిచ్చింది భార్య. ఎన్ని పనులున్నా రోజూ ఆమెకు కాసింత సమయం ఇవ్వండి. అందులో చొరబాట్లు, కోతలు వద్దు.
చేతిలో చెయ్యి వేయండి, దగ్గరికి తీసుకోండి, ముద్దు పెట్టుకోండి.. ప్రేమ పూర్వక స్పర్శ ఏ రూపంలో అయినా ఉండొచ్చు.