మండే ఎండల్లో ఉపశమనం కోసం ప్రతి ఒక్కరూ ఎయిర్ కండిషనర్ను కోరుకోవడం సర్వ సాధారణం. మధ్యాహ్నం ఎండ ధాటికి తట్టుకోలేక ఏసీ రూముల్లో దూరిపోయేవారి సంఖ్య అధికంగానే ఉంటుంది. అయితే ఏసీ బాగా పనిచేయాలంటే దానిలో రిఫ్రిజిరేంజ్ తప్పనిసరి. దీన్నే గ్యాస్ అని కూడా పిలుస్తారు. గ్యాస్ సాయంతోనే కంప్రెషర్ పనిచేస్తుంది.
అదికాస్తా తగ్గితే కంప్రెషర్‌పై విపరీతమైన ఒత్తిడి పడి త్వరగా వేడెక్కుతుంది. మరీ ఎక్కువైతే అది పాడైపోతుంది. కంప్రెషర్ మార్చడమనేది ఖర్చుతో కూడుకున్న పని. ఏసీ యూనిట్ నుంచి బుసల లాంటి శబ్దాలు వస్తుంటే గ్యాస్ లీక్ అవుతుందనడానికి సూచన అన్నమాట. కాబట్టి, ఒకసారి మీ ఏసీ ఎలా ఉందో గమనించి, సర్వీసింగ్ చేయించి.. ఈ వేసవిని చల్లగా దాటేయండి.