Parenting Tips | మీ పిల్లలు టీనేజీలోకి అడుగుపెడుతున్నారా.. అయితే పేరెంట్స్ ఈ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిందే!
Parenting Tips | తొమ్మిది నెలలూ మోయడం, జన్మనివ్వడం, పాలుపట్టడం, ముద్దలు పెట్టడం, నడక నేర్పడం, మాటలు పలికించడం,బడికి పంపడం వరకూ ఒక ఎత్తు. ఒక్కసారి పిల్లలు కౌమారంలోకి రాగానే.. అంతకు పదిరెట్ల్ల సవాలు ఎదురవుతుంది కన్నతల్లికి.
Parenting Tips | తొమ్మిది నెలలూ మోయడం, జన్మనివ్వడం, పాలుపట్టడం, ముద్దలు పెట్టడం, నడక నేర్పడం, మాటలు పలికించడం,బడికి పంపడం వరకూ ఒక ఎత్తు. ఒక్కసారి పిల్లలు కౌమారంలోకి రాగానే.. అంతకు పదిరెట్ల్ల సవాలు ఎదురవుతుంది కన్నతల్లికి.
పిల్లలు టీనేజ్‌కు చేరుకోగానే అమ్మకు కొత్త కష్టం మొదలవుతుంది. ఒక్కసారిగా స్వతంత్ర గానం వినిపిస్తారు, ధిక్కరించడం ఆరంభిస్తారు. మంచి చెప్పినా, చెడు గురించి హెచ్చరించినా ‘లెక్చర్లు వద్దు మమ్మీ!’ అంటూ మొహం మీదే అనేస్తారు. దీంతో అమ్మ మనసు చిన్నబోతుంది. కన్నపేగు కలుక్కుమంటుంది. ‘నాకు తెలుసు. నేను నిర్ణయించుకుంటాను. నన్ను పసిబిడ్డలా చూడొద్దు ప్లీజ్!’ అంటూ ఆమె ప్రేమపూర్వక చొరవను అడ్డుకుంటారు.
‘ఇప్పటి వరకూ నా మీద పెత్తనం చేసింది చాలు’ అన్నట్టుగా వ్యవహరిస్తారు. ఇదంతా వాళ్ల తప్పు కాదు. మెదడులో చకచకా జరిగిపోయే రసాయన చర్యల ప్రభావం. హార్మోన్ల హార్మోనియం. పాత పట్ల అయిష్టతకు, కొత్తదనం పట్ల ఆసక్తికి కారణమూ అదే. పిల్లలకు తగినట్టు కన్నవారు మారకపోతే ఇంట్లో పెద్ద యుద్ధమే జరుగుతుంది. ఆ పరిస్థితుల్లో అమ్మ ఏం చేయాలి? ఎలా వ్యవహరించాలి?
ఆమోదించాలి
పిల్లల జీవితంలో అదో తాత్కాలిక దశ మాత్రమే. చివరిదాకా ఇలానే ఉంటారని అనుకోకండి. అన్నిటికంటే ముందు వాళ్లను యథాతథంగా ఆమోదించండి. ఆ కోపం, ఆ అసహనం.. కేవలం రసాయన చర్యల ఫలితమే అని గుర్తించండి. దయచేసి వాటిని నెగెటివ్‌గా తీసుకోకండి. ఓపిగ్గా, చిరునవ్వుతో స్పందించండి.
కమ్యూనికేషన్ ముఖ్యం
వాళ్లు చెప్పేది సావధానంగా వినండి.జడ్జిమెంట్ వద్దు. వ్యాఖ్యానాలు చేయొద్దు. బిడ్డ ప్రతి పాజిటివ్ ఆలోచనకూ మీ మద్దతు తెలపండి. లోపాల గురించి సున్నితంగా చెప్పే ప్రయత్నం చేయండి. అదీ నేరుగా కాకుండా.. ఉదాహరణలు ఎంచుకోండి.
సరికొత్త ప్రపంచానికి వెళ్లండి
తను ఇష్టపడే సంగీతం, చదివే పుస్తకాలు, చూసే టీవీ షోలు, ఉపయోగించే యాప్స్.. వీటితో మీరూ పరిచయం పెంచుకోండి. దీనివల్ల ఆ కౌమార బాలలతో మాట్లాడ టానికి ఓ టాపిక్ దొరుకుతుంది. బంధాన్ని బలోపేతం చేసుకోడానికి ఓ అవకాశమూ లభిస్తుంది. బెస్ట్ ఆఫ్ లక్!
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

