Mana | ఇండియాస్ లాస్ట్ టీ కప్.. ఇక్కడ ఛాయ్ తాగితే అన్నీ మరిచిపోవాల్సిందే!
Mana | భారతదేశం చిట్టచివరి గ్రామంగా పేరున్న ‘మానా’లో ‘ఇండియాస్ లాస్ట్ టీ షాప్' చిత్తరువులు ఇటీవల టీ కన్న ఘాటుగా వైరల్ అయ్యాయి! ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంటుంది మానా. ఇక్కడికి చేరుకోవాలంటే బదరీనాథ్ దాటుకొని వెళ్లాలి.
Mana | ‘చిటారు కొమ్మన మిఠాయి పొట్లాన్ని’ వాటంగా అందుకోవడం ద గ్రేట్ గిరీశానికి మాత్రమే చెల్లింది కానీ, అది అందరికీ సాధ్యమయ్యే పని కాదు! అలాగని దిగులు పడకండి. మీ కోసం చిటారు కొండన మిఠాయిని మరిపించే మేటి టీ సదా సిద్ధంగా ఉంటుంది. దాన్ని రుచి చూసి ఏదో ఘనత వహించిన భావనకు లోనైతే మన పొరపాటు! ఆ సేతుహిమాచలం దేశాల సరిహద్దులు పంచుకునే ఎల్లల్లోనూ ఎల్లవేళలా లభ్యమయ్యే ఏకాక్షరికే ఈ ఘనత దక్కుతుంది. కశ్మీరు లోయలో, కన్యాకుమారిలో ఓ చుక్క మామా అనగానే టీ చుక్క గొంతును పావనం చేస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే మన భారతావనిలో మనుషులు మసిలే ప్రతి నెలవులోనూ తేనీరు నిరంతరాయంగా మసులుతూనే ఉంటుంది. ఇంత ఉపోద్ఘాతం చెప్పుకొచ్చింది దేనికంటే.. భారతదేశం చిట్టచివరి గ్రామంగా పేరున్న ‘మానా’లో ‘ఇండియాస్ లాస్ట్ టీ షాప్’ చిత్తరువులు ఇటీవల టీ కన్న ఘాటుగా వైరల్ అయ్యాయి!
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంటుంది మానా. ఇక్కడికి చేరుకోవాలంటే బదరీనాథ్ దాటుకొని వెళ్లాలి. మంచుకొండల నడుమ టిబెట్‌తో సరిహద్దు పంచుకున్న మానా సొగసును చూస్తూ ఏమనాలన్నదీ మర్చిపోతాం. ప్రకృతికాంత అంత మనోహరంగా ఉంటుందిక్కడ. చక్షువులతో సౌందర్యాన్ని ఎంత జుర్రుకున్నా.. ముముక్షువుల తపోనిష్ఠను సైతం కాసేపు ఆపేలా చేసే ఉష్ణోదకాన్ని సేవిస్తే గానీ, అక్కడి చలిపులి పంజా నుంచి తప్పించుకోలేం. సముద్ర మట్టానికి దాదాపు 10,560 అడుగుల ఎత్తులో ఉన్న మానాలో ఓ గిరి పాదంలో, దారి మలుపులో ఉంటుందీ ‘చివరి టీ కొట్టు’. రివ్వున వీచే చలిగాలిని గేలి చేస్తూ కుంపటిపై నిరంతరం గరమ్ గరమ్ చాయ్ కాగుతూనే ఉంటుంది. మరుగుతున్న ఏకాక్షరి కొండగాలి హోరుకు వంతపాడుతూ పురాణాల్లో వర్ణించినట్టుగా క్షీరసాగర మథన వేళ పుట్టిన కోలాహలాన్ని గుర్తుకుతెస్తుంది. జేబులో కాసుల్లేవని కంగారొద్దు! ఈ చివరి టీ అంగడిలోనూ ఆన్లైన్ పేమెంట్ అవకాశం ఉంది!!
చాకొలెట్ టీ
కావాల్సినవి: టీ పొడి: రెండు టేబుల్ స్పూన్లు, కోకో పౌడర్: ఒకటిన్నర టేబుల్ స్పూన్, పాలు: రెండు కప్పులు, నీళ్లు: రెండు కప్పులు, దాల్చిన చెక్క: అర అంగుళం, యాలకులు: రెండు, లవంగాలు: రెండు, చక్కెర: రెండు టేబుల్ స్పూన్లు
తయారీ: గిన్నెలో నీళ్లు పోసి సెగ వచ్చాక, టీ పొడి, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క వేసి మూడు నిమిషాలు మరిగించాలి. తర్వాత అందులోకి పాలు పోసి మరో రెండు నిమిషాలు వేడిచేయాలి. తర్వాత చక్కెర వేయాలి. చివరిగా కోకో పౌడర్ వేసి టీలో బాగా కలిసిపోయేలా కలపాలి. రెండు పొంగులు వచ్చిన తర్వాత కప్పుల్లోకి వడగట్టుకుంటే చాకొలెట్ రంగులో ఘుమఘుమలాడే టీ సిద్ధం!
‘టీ’కా తాత్పర్యం
రోజూ తేనీటిని ఆస్వాదించే కొన్ని నిమిషాలను నా జీవితంలో అత్యంత విలువైన క్షణాలుగా పరిగణిస్తాను.
హెన్రీ జేమ్స్, ఆంగ్ల రచయిత
Read More :
Tea History | చైనాలో క్రీ.పూ. నుంచే తేయాకు పండినప్పటికీ జపాన్‌కు అస్సలు ఇవ్వలేదు.. చివరకు ఆ బౌద్ధ భిక్షువు పుణ్యమా అని చేరింది!Tea Tales | తేయాకు తోటలకు వెళ్లి మీరూ ఇలా మోసపోయారా?
Tea | కేరళలోని ఈ ఆలయంలో ఛాయ్‌నే తీర్థం.. పెసర గుడాలే ప్రసాదం !!
Tea History | అప్పట్లో తేయాకు కోసం ఆంగ్లేయులు, చైనా మధ్య పెద్ద యుద్ధమే జరిగింది!!
Tea | రైలు ప్రయాణంలో ఒక కప్పు ఛాయ్ తాగితే ఆ కిక్కే వేరు!
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jairam Ramesh | రాముడి పేరుతో పాపాలు ఇంకెన్నాళ్లు..? బీజేపీపై జైరాం రమేష్ ఆగ్రహం
Talasani Srinivas Yadav | ఆర్జేడీ నేత తేజస్విప్రసాద్ యాదవ్, ఎస్పీ నేతలకు తలసాని స్వాగతం.. వీడియో
cop caught in woman’s home | అర్ధరాత్రి వేళ మహిళ ఇంట్లో పోలీస్ అధికారి.. చుట్టుముట్టిన గ్రామస్తులపై కాల్పులు, ఒకరు మృతి
అన్ని వర్గాలను మోసం చేసిన కాంగ్రెస్ : మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్
Weather Changes | ప్రపంచ దేశాల్లో దుర్భరమవుతున్న వాతావరణ పరిస్థితులు.. అధ్యయనంలో వెల్లడి..
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

