వేడివేడిగా.. ఆరోగ్యంగా
వానకాలం సాయంత్రాలు చిరుతిళ్లు తినడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతారు. ఇందులో వేడివేడిగా నూనెలో వేయించినవే అధికంగా ఉంటాయి. డీప్ ఫ్రైడ్ ఫుడ్లకు ప్రత్యామ్నాయంగా ఎలాంటి స్నాక్స్ తీసుకోవచ్చు?
వానకాలం సాయంత్రాలు చిరుతిళ్లు తినడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతారు. ఇందులో వేడివేడిగా నూనెలో వేయించినవే అధికంగా ఉంటాయి. డీప్ ఫ్రైడ్ ఫుడ్లకు ప్రత్యామ్నాయంగా ఎలాంటి స్నాక్స్ తీసుకోవచ్చు?
– ఓ పాఠకురాలు
వానకాలం అంటే వేడివేడి బజ్జీలు, పకోడీలే గుర్తొస్తాయి. చల్లటి వాతావరణంలో ఇలాంటివి తినడానికే చాలామంది ఇష్టపడతారు. ఆరోగ్యవంతులైన వాళ్లు అప్పుడప్పుడూ తిన్నా ఫర్వాలేదు కానీ, పూర్తిగా నూనెలో ముంచి తేల్చిన వీటికి బీపీ, షుగర్, అధిక బరువులాంటి సమస్యలు ఉన్న వాళ్లు మాత్రం దూరంగా ఉండాల్సిందే. వీటికి బదులు ఉడికించినవి, పాన్ఫ్రై చేసినవి వేడి వేడిగా తింటే మంచిది. ఉడకబెట్టిన కార్న్, పల్లీ గింజల్లో చాట్ మసాలా, మిరియాల పొడిలాంటివి చల్లుకొని తీసుకోవచ్చు. వేయించిన పల్లీలు, పాప్‌కార్న్ కూడా కాస్త కరకరలాడేలా తినొచ్చు. పొద్దుతిరుగుడు, గుమ్మడి గింజలు తదితరాలను సన్నటి సెగ మీద ఫ్రై చేసి, ఉప్పు, మిరియాల పొడి వేసుకోవచ్చు.
మల్టీ గ్రెయిన్ బ్రెడ్‌తో వెజిటబుల్ శాండ్విచ్, పనీర్, ఎగ్, చికెన్ శాండ్విచ్లు చేసుకోవచ్చు. వీటివల్ల పొట్ట నిండుతుంది. దీంతో వేరే ఇంకేవీ తినాలన్న ఆలోచన రాదు. చిలగడదుంప వేడివేడిగా ఉడకబెట్టుకొని తిన్నా ఆకలి తీరుతుంది. రుచీ ఉంటుంది. చేప ముక్కలను గ్రిల్ చేసుకునిగానీ, పెనం మీద కొంచెం ఆయిల్ వేసి వేయించిగానీ ఆరగించవచ్చు. పెసలు, శనగలు కూడా పోపు వేసుకుంటే బాగుంటాయి. ఆలూ టిక్కీ, నానబెట్టిన పెసర్ల టిక్కీ చేసుకొని వేడివేడిగా లాగించినా ఆరోగ్యమే. అలాగే పెరుగు మిగిలితే బీరకాయ, సొరకాయలాంటివి కూరగాయలు వేసి మజ్జిగ పులుసు చేసుకొంటే సూప్‌లాగా లాగించవచ్చు. ఇలా ఆరోగ్యకరంగా కొత్తకొత్త రుచులతో వానకాలాన్ని చక్కగా ఎంజాయ్ చేయొచ్చు.
మయూరి ఆవుల ,న్యూట్రిషనిస్ట్
Mayuri.trudiet@gmail.com
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
President Droupadi Murmu | ఒడిశాకు తుఫాన్ సూచన.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన వాయిదా
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
Sridhar Vembu | ఏఐ రంగంలో కనిపిస్తున్నది బూమ్ కాదు బుడగ : శ్రీధర్ వెంబు
Lulu jobmela | ఈ నెల 27న జాబ్ మేళా.. వివరాలివే
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

